కోనసీమ జిల్లా పేరు మార్పు అంశంలో రాజుకున్న వివాదం మంగళవారం తీవ్ర దాడులకు, శాంతి భద్రతల విఘాతానికి దారి తీసింది. ఈ అంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ స్పందించారు. ఈ దాడుల వెనుక జనసేన, ప్రతిపక్షాలు ఉన్నాయనే ఆరోపణలు, విమర్శలను తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కావాలనే గొడవలు సృష్టిస్తోందంటూ దుయ్యబట్టారు. కొత్త జిల్లాల పేర్లు ప్రకటించిన సమయంలోనే అంబేడ్కర్ కోనసీమ జిల్లా అని పెట్టేస్తే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేదే కాదని పవన్ అభిప్రాయ పడ్డారు. కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలోనే అంబేడ్కర్ పేరు పెడితే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చేది కాదని పవన్ వ్యాఖ్యానించారు.
జిల్లా పేరు మార్పు అంశంపై పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. ‘ఏ జిల్లాకి అభ్యంతరాలు తెలిపేందుకు గడువు ఇవ్వని ప్రభుత్వం.. ఎందుకు కోనసీమ విషయంలో 30 రోజుల గడువు ఇచ్చింది. దీన్ని కావాలనే జాప్యం చేయడంలో వారి ఉద్దేశం ఏంటో ఎవరికీ అంతుపట్టడం లేదు. జిల్లాకి జాతీయ స్థాయి నేతల పేర్లు పెట్టడం జనసేన ఆహ్వానించేది.. అభినందించే అంశమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరణకు కారణమైన పొట్టి శ్రీరాములు పేరు పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అని పెట్టడం వల్ల ఆయనకు గౌరవం ఇచ్చినట్లు అయ్యింది. అయితే రాష్ట్రం ఏర్పాటుకు పాటు పడిన వ్యక్తిని జిల్లాకు పరిమితం చేయడం గౌరవం పెంచినట్లా? తగ్గించినట్లా?’.
ఇదీ చదవండి: నివురుగప్పిన నిప్పులా కోనసీమ.. ఇంటర్నెట్ సేవలు బంద్!
ఇదీ చదవండి: భగ్గుమన్న అమలాపురం.. కారణాలు ఏంటి.. ఆందోళకారుల ఏం కోరుతున్నారు!‘అభ్యంతరాలు తెలిపేందుకు 30 రోజుల గడువు ఎందుకు ఇచ్చారు?. అంటే ఈ విషయంలో గొడవలు జరుగుతాయని ముందే తెలుసు. ప్రజల భావోద్వేగాలను రెచ్చగొట్టారు. దాడులు, గొడవలు జరిగే వాతావరణం సృష్టించడానికే ఇలా చేశారు. అభ్యంతరాలు ఇచ్చేందుకు సామూహికంగా కాదు.. వ్యక్తులుగా రావాలి అని చెప్పారు. మంత్రి అద్దెకు ఉండే ఇంటిపై దాడి జరుగుతుంటే యంత్రాంగం ప్రేక్షకపాత్ర వహించేలా చేశారు. నాయకుల ఇళ్లపై దాడులు జరగడం చూస్తే.. ఇది ప్రీ ప్లాన్డ్ గా చేసిన దాడుల మాదిరిగానే ఉన్నాయి. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పుదోవ పట్టించడానికే ఇలా చేస్తున్నారు.’
‘అంబేడ్కర్ అంటే గౌరవం ఉండి పేరు పెట్టాలి అనుకుంటే అన్ని జిల్లాలు ఉంటే కోనసీమకే ఎందుకు పెట్టాలి అనుకున్నారు. నిజంగా కోనసీమకు పెట్టాలి అనుకుంటే అన్ని జిల్లాలతో పాటే పెట్టుండచ్చుగా. లేదు అంబేడ్కర్ అంటే గౌరవం ఉంటే కడప జిల్లాకు ఆ పేరు పెట్టి ఉండచ్చు కదా? సరే కడప జిల్లాకు వైఎస్సార్ పేరు పెట్టారు.. జిల్లాల పునఃవిభజన సమయంలో కడపను కొత్త జిల్లాలుగా చేసే సమయంలో అంబేడ్కకర్ పెట్టి ఉండచ్చు కదా?’ అంటూ పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.