పూనమ్ కౌర్-పవన్ కళ్యాణ్ కలిసున్న వీడియో కావాలా? యాంకర్ సంచలన కామెంట్

స్పెషల్ డెస్క్- జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, జగన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించి, ఆరోపణలు చేసిన తరువాత ఈ ఇష్యూ చిలికి చిలికి గాలివాన అయ్యింది. ఇందులోకి సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి ఎంటరవ్వడంతో వివాదం మరింత ముదిరింది. అందులోను ఓ హీరోయిన్ ను శారీరకరంగా వాడుకుని, కడుపు చేసి, ఆమెను బెదిరించి, అబార్షన్ చేసించి, డబ్బులు ఇచ్చి నోరు మూయించి అన్యాయం చేశారని పోసాని ఆరోపణలు గుప్పించడం ఆసక్తికరంగా మారింది.

పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు పవన్ కళ్యాణ్, హీరోయిన్ పూనమ్ కౌర్ గురించేనని చర్చ మొదలైంది. రాజకీయ వర్గాలతో పాటు, ఫిల్మ్ ఇండస్ట్రీ వర్గాల్లోను పూనమ్ కౌర్ అంశంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదిగో ఇటువంటి సమయంలో మాజీ యాంకర్, బీజేపీ నాయకురాలు స్వేతా రెడ్డి పూనమ్ కౌర్ అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె కామెంట్స్ ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Swetha reddy

పోసాని కృష్ణ మురళి పవన్ కళ్యాణ్‌పై చేసిన వ్యాఖ్యలు నిజమేనని, పూనమ్ కౌర్‌కి కడుపు చేసి అబార్షన్ చేయించి, డబ్బుతో ఆమె నోరునొక్కిన మాట వాస్తమేనని స్వేతా రెడ్డి ఈ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వూలో చెప్పింది. పవన్ వర్సెస్ పోసాని గొడవలో తన మద్దతు పోసానికేనని స్వేతా రెడ్డి కుండబద్దలు కొట్టింది. పూనమ్ కౌర్‌కి అన్యాయం జరిగిందని పోసాని కృష్ణమురళి చెప్పారని గుర్తు చేసిన స్వేతా రెడ్డి, పూనమ్ కౌర్ ప్రెస్ మీట్ పెట్టి నాకు అన్యాయం జరిగిందని చెప్తేనే చెప్పినట్టా అని ప్రశ్నించారు.

పూనమ్ కౌర్ నిజంగా మోసపోకుండా ఉండి ఉంటే,ప్రెస్ మీట్ పెట్టి తనకు అన్యాయం జరగలేదని చెప్పమనండని ఆమె డిమాండ్ చేసింది. పవన్ కళ్యాణ్‌ కి నాకు ఎలాంటి సంబంధం లేదని, నాకు కడుపు చేయలేదని, అబార్షన్ చేయించలేదని పూనమ్ కౌర్ ను చెప్పమనండి అని స్వేతా రెడ్డి అన్నారు. ఇలాంటి సెన్సిటివ్ అంశాలు, ఘటనలకు ఆధారాలు ఉన్నాయా అని అడిగితే ఎలా అని స్వేతా రెడ్డి ప్రశ్నించారు. వాళ్లిద్దరూ ఏదో చేసుకుంటే ఆ సమయంలో వెళ్లి వీడియోలు ఎవరు తీస్తారని ఆమె నిలదీశారు.

సినిమా పరిశ్రమలో ఇంతమంది ఉండగా, పూనమ్ కౌర్ గురించి మాత్రమే ఎందుకు మాట్లాడుకుంటున్నారో ఆలోచించాలని స్వేతా రెడ్డి అన్నారు. పవన్ కళ్యాణ్ పేరు చాలా మంది అమ్మాయిలు శరీరంపై టాటూలు కూడా వేసుకుంటున్నారు. మరి వాళ్ల పేర్ల ప్రస్తావన లేకుండా కేవలం పూనమ్ కౌర్ పేరు మాత్రమే బయటకు వచ్చిందంటేనే ఆమెకు నిజంగానే అన్యాయం జరిగిందని అర్ధమవుతోందని స్వేతా రెడ్డి వ్యాఖ్యానించారు.