సినిమా ప్రమోషన్ కోసం హీరో విశ్వక్‌సేన్ చేసిన ప్రాంక్ వీడియో పెద్ద దుమారం రేపింది. దీనిపై కొందరు అభ్యంతరం వ్యక్తం చేయగా.. ఈ సంఘటనపై ప్రముఖ చానెల్ డిబెట్ నిర్వహించడం.. అక్కడ యాంకర్‌కి, విశ్వక్ సేన్‌కి మధ్య వివాదం.. ముదరడం.. యాంకర్ దేవి నాగవల్లి విశ్వక్‌ను గెట్ ఔట్ అనడం.. ఆగ్రహించని విశ్వక్.. లైవ్‌లోనే బూతులు తిట్టడం వంటి పరిణామాలు చకచకా చోటు చేసుకుంది. ఈ వ్యవహారంలో కొందరు విశ్వక్‌కు మద్దతు తెలుపుతుండగా.. మరి కొందరు.. మహిళను ఉద్దేశిస్తూ F అనే పదం వాడటం ఏంటని విమర్శిస్తున్నారు. దీనిపై విశ్వక్ సేన్ క్షమాపణలు చెప్పినప్పటికి.. ఈ వివాదానికి ఇప్పట్లో ముగింపు లభించేటట్టు లేదు. తాజాగా ఈ వివాదంపై టీఆర్‌ఎస్ దానం నాగేందర్ స్పందించారు.
ఇది కూడా చదవండి: Vishwak Sen: ప్రముఖ మీడియా ఛానల్ లో అభ్యంతరకర భాష వాడినందుకు విశ్వక్ క్షమాపణలు!
‘‘రోడ్లపై ఇలాంటి వ్యవహారాలు చేయడమే తప్పు. ఆయన క్షమాపణ చెప్పినా మేం అంగీకరించం. అతడు వేదిక మీద ఎఫ్ పదం వాడగానే.. దేవి నాగవల్లి.. చెప్పుతో కొట్టాల్సింది. అతడిపై పోలీసులు సుమోటోగా కేసు ఫైల్ చేయాలి. దెబ్బ తగిలితే.. అమ్మా అన్నట్లు ఆ పదం వాడిన అంటున్నాడు.. అదే సమయంలో విశ్వక్ సేక్ పక్కన అతడి తల్లి, చెల్లి ఉంటే ఇలానే మాట్లాడతాడా.. సారీ చెప్తే సరిపోదు.. నాగవల్లి.. కాళ్లు పట్టుకుని క్షమాపణలు చెప్పాలి. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు రిపీట్ అయితే బట్టలిప్పదీసి పరిగెత్తించి కొడతాం’’ అని ఎమ్మెల్యే దానం నాగేందర్ హెచ్చరించారు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Devi Nagavalli: విశ్వక్‌సేన్‌కి మద్దతు.. యాంకర్‌ని ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!