విశ్వక్ సేన్– యాంకర్ దేవీ నాగవల్లి వివాదానికి ఇంకా ఫుల్ స్టాప్ పడలేదు. దాడి ప్రతిదాడి అన్నట్లు విషయం కొనసాగుతూనే ఉంది. మహిళా యాంకర్ తో అభ్యంతరకర భాష వాడారని కొందరు వాదిస్తుంటే.. ఇంకొందరు స్టూడియోకి పిలిచి గెట్ అవుట్ అంటూ విశ్వక్ ను అవమానించారంటూ చెబుతున్నారు. ఈ క్రమంలో విశ్వక్ అభిమానులు సైతం సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. విశ్వక్ సేన్ కు క్షమాపణలు చెప్పాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. విశ్వక్ ఫ్యాన్స్ కొంత మందిని ఈ విషయంపై ప్రశ్నించగా వారు కొన్ని ప్రశ్నలు లేవనెత్తారు. ప్రస్తుతం విశ్వక్ ఫ్యాన్స్ చేసిన డిమాండ్, లేవనెత్తిన ప్రశ్నలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆ ప్రశ్నలు, డిమాండ్లు ఏంటో మీరూ చూసేయండి. ఈ పూర్తి వివాదంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.