టీవీ షోలు రేటింగ్ పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తాయి. అయితే ఎక్కువగా క్లిక్ అయిన టెక్నిక్ మాత్ర.. షోలోని కంటెస్టెంట్ల మధ్య లవ్ ట్రాక్లని నడపడం. సుధీర్-రష్మి జోడి విషయంలో చేసిన ఈ ప్రయోగం ఫలించడంతో.. ఆ తర్వాత చాలా చానెల్స్ ఇదే రూట్ ఫాలో అయ్యాయి. కానీ వారేవ్వరూ సుధీర్-రష్మి జోడీ రేంజ్లో పాపులర్ కాలేదు. కానీ వర్ష-ఇమ్మాన్యూయేల్ల మధ్య స్టార్ట్ చేసిన లవ్ ట్రాక్ కాస్త ప్రేక్షకులను అలరించింది. కానీ దాన్ని కూడా అతి చేసి చెడగొట్టారు. ఒకానొక సమయంలో వీరిద్దరి లవ్ ట్రాక్ మీద భారీ విమర్శలు రావడంతో.. కొన్నాళ్లు అలాంటి వాటిని ఆపేశారు. ఇక ఈ మధ్య కాలంలో జబర్దస్త్ నుంచి స్టార్ కమెడియన్లు వెళ్లిపోవడం.. పలు వివాదాలు చుట్టుముట్టడం వంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి. ఈ క్రమంలో మరోసారి షో రేటింగ్స్ పెంచడం కోసం లవ్ ట్రాక్నే ఆశ్రయించారు నిర్వాహాకులు. మరోసారి వర్ష-ఇమ్మాన్యూయేల్ల మధ్య లవ్ సీన్లు పండించే ప్రయత్నం చేశారు. షోలో భాగంగా గెటప్ శ్రీను టీమ్‌లో వర్ష-ఇమ్మూల మధ్య లవ్ ట్రాక్ నడిపించారు. ఈ స్కిట్లో గెటప్ శ్రీను యముడి వేషంలో ఆకట్టుకున్నాడు. ఇక స్కిట్ కోసం ప్రేమికులను శిక్షించే లైన్ తీసుకుని.. చేశాడు. దీనిలో భాగంగా తొలుత రాకింగ్ రాకేష్-సుజాత వచ్చారు. ఆ తర్వాత ఇమ్మాన్యూయేల్, వర్ష జంటను గురించి చెప్పారు. మీది నిజమైన ప్రేమ అని ప్రూవ్ చేసుకుంటే పంపించేస్తామని గెటప్ శ్రీను చెప్పగా.. వర్ష భారీ రేంజ్లో ప్రేమ డైలాగ్స్‌తో రెచ్చిపోయింది. ‘‘ఇమ్మూ.. అందరికీ ఓ డౌట్ ఉంది. అసలు ఏంటి మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా... లేదా.. అని. దానికి సమాధానం ఏంటంటే.. ఇమ్మూ కాదన్న రోజు ఈ వర్ష ప్రాణాలతో ఉండదు’’ అంటూ భారీ డైలాగ్స్ పేల్చి.. మరోసారి తన ప్రేమను బయటపెట్టింది. వర్ష మాటలు విన్న ఇమ్మూ సంతోషంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ప్రోమో తెగ వైరలవుతోంది. టీఆర్పీ రేటింగ్ కోసమే చేసినా.. నెటిజనులను మాత్రం బాగానే ఆకట్టుకుంటుంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: డ్రంక్ అండ్ డ్రైవ్ పోలీసులకు చిక్కిన జబర్ధస్త్ వర్ష, ఇమాన్యూయేల్ ఇది కూడా చదవండి: చావు బతుకుల మధ్య వర్ష అంటూ వార్తలు! అసలు నిజం ఏమిటంటే?