Jabardasth Varsha Clarity On Fake Thumbnail Video: జబర్దస్త్ షో ద్వారా ఎంతో పాపులారిటి సాధించుకుంది వర్ష. చాలా తక్కువ సమయంలోనే వర్షకు మంచి పేరొచ్చింది. ఆమెకు ప్రత్యేకంగా ఫ్యాన్స్ కూడా ఉన్నారు. జబర్దస్త్ తో పాటు పలు స్పెషల్ ఈవెంట్స్ కూడా చేస్తూ ఆకట్టుకుంటోంది వర్ష. కొన్ని రోజులు టీవీ సీరియల్స్‌లో కూడా నటించింది. ఆ తర్వాత తన పూర్తి ఫోకస్ జబర్దస్త్ మీదే పెట్టింది. ప్రస్తుతం శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా కనిపిస్తుంది. ఇక జబర్దస్త్‌లో వర్ష-ఇమ్యాన్యుయేల్ జోడీకి ఎంత పేరొచ్చిందే ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. చూడటానికి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ అయినప్పటికీ వీళ్లిద్దరి కామెడీ టైమింగ్, ఆన్ స్క్రీన్ పర్ఫార్మెన్స్ జనం మెప్పు పొందాయి. ఇక తాజాగా వర్షకు సంబంధించి ఓ వార్త నెట్టింట తెగ వైరలవుతోంది. అదేంటంటే.. చావుబతుకుల్లో జబర్దస్త్ వర్ష అనే థంబ్నెయిల్తో ఫేక్ న్యూస్ క్రియేట్ చేశారు. ఇక వ్యూస్ కోసం కొన్ని యూట్యూబ్ చానెల్స్ ఎంతకు దిగజారతాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా సెలబ్రిటీలకు ప్రమాదాలు అని.. చావుబతుకుల్లో ఉన్నారని ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం చూస్తూనే ఉంటాం. ఈ క్రమంలోనే తాజాగా వర్ష గురించి ఇలా ఫేక్ థంబ్ నెయిల్‌తో తప్పుడు వార్తలు ప్రచారం చేశారు. ఇది కూడా చదవండి: Karate Kalyani: పెళ్లిపై కరాటే కళ్యాణి పోస్ట్ వైరల్.. ‘‘నా అందాల రారాజు కోసం ఎదురు చూస్తున్నాను’’ చావు బతుకుల మధ్య జబర్దస్త్ వర్ష అని వీడియో వదిలారు. దీంతో అసలు వర్షకు ఏమైంది అని అంతా కంగారు పడ్డారు. ఇది వర్ష దృష్టికి రావడంతో ఇది ఫేక్ న్యూస్ అని చెప్పేస్తూ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా వెల్లడించింది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జబర్ధస్త్ వర్ష.. తనపై వస్తున్న వార్తలు, పుకార్లను ఖండిస్తూ ఉంటుంది. ఇందులో భాగంగానే తాజాగా చావు బతుకుల మధ్య జబర్ధస్త్ వర్ష అంటూ కనిపించిన న్యూస్ థంబ్‌నెయిల్‌ను తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసి అసలు విషయం చెప్పేసింది వర్ష. కాగా, వర్షకున్న పాపులారిటీతో ఆమెకు బిగ్ బాస్ ఆఫర్ కూడా వచ్చిందని టాక్. మరికొద్ది రోజుల్లో ప్రసారం కాబోయే బిగ్ బాస్ 6లో ఆమె భాగం కానుందని తెలుస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇది కూడా చదవండి: Pavitra Lokesh: నా భర్త ఎంతో మంచివాడు.. ఆయన భర్తగా లభించడం నా అదృష్టం: పవిత్ర లోకేష్