సాధారణంగా ప్రేక్షకులకు వినోదాన్ని పంచడంలో లేదా వారిని నవ్వించడంలో ఒక్కొక్కరికి ఒక్కో శైలి ఉంటుంది. కొందరు మాటలతో నవ్విస్తారు. ఇంకొందరు కామెడీ చేసి నవ్విస్తుంటారు. అయితే.. కొద్దిమందిలో మాత్రమే అటు మాటలతో, ఇటు హావభావాలతో నవ్వించే టాలెంట్ ఉంటుంది. ఆ విధంగా బుల్లితెర ప్రేక్షకులకు వినోదాన్ని పంచుతూ, కడుపుబ్బా నవ్విస్తున్న లేడీ కమెడియన్స్ లో జబర్దస్త్ రోహిణి ఒకరు. ఈమెను రౌడీ రోహిణి అని కూడా అంటుంటారు. బుల్లితెరపై నటిగా కెరీర్ స్టార్ట్ చేసిన రోహిణి.. కామెడీ పంచులు, ప్రాసలతో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఇక ఓవైపు కామెడీ షోస్ చేస్తూనే మరోవైపు టీవీ ప్రోగ్రామ్స్ తో ఆకట్టుకుంటున్న రోహిణి.. ఎక్కడుంటే అక్కడ ఫన్ క్రియేట్ చేస్తుంటుంది. అదీగాక ఇటీవలే తన సొంతింటి కల నెరవేర్చుకుని, హోమ్ టూర్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఆ విధంగా యూట్యూబ్ లో కూడా మంచి ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే.. అందరి లైఫ్ లో లవ్ స్టోరీస్ ఉన్నట్లే రోహిణి లైఫ్ లో కూడా ఓ లవ్ స్టోరీ ఉందనే విషయం ఎవరికీ పెద్దగా తెలియదు. కానీ.. తాజాగా తనకు ఓ లవ్ స్టోరీ ఉందని, ఆ లవ్ కూడా విషాదాన్ని మిగిల్చిందని ఓ ప్రోగ్రాంలో చెప్పి ఎమోషనల్ అయ్యింది రోహిణి. మరి రోహిణి లవ్ స్టోరీ ఏంటనే వివరాల్లోకి వెళ్తే.. తెలుగు బుల్లితెరపై ఈ ఆదివారం నుండి 'మన ఊరి రంగస్థలం' అనే కొత్త ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేయనుంది జీ తెలుగు. అయితే.. ఈ ప్రోగ్రాంకి సంబంధించి కొత్త ప్రోమో రిలీజ్ చేశారు నిర్వాహకులు. మొదటి ఎపిసోడ్ కాబట్టి.. అన్ని హంగులతో, సింగర్స్, యాక్టర్స్, స్పెషల్ పెర్ఫార్మన్స్ లతో అదరగొట్టబోతున్నారు. అందరూ కూడా ప్రోమోలో అద్భుతమైన వినోదాన్ని పంచారు. ఈ కార్యక్రమానికి శ్రీముఖి హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఈ ఆదివారం 12 గంటలకు ఈ ప్రోగ్రామ్ ప్రసారం కాబోతుంది. ఈ క్రమంలో ప్రోమోలో భాగంగా సింగర్స్ ఓ బ్రేకప్ సాంగ్ పాడటంతో.. శ్రీముఖి ఒక్కొక్కరిని వాళ్ళ లైఫ్ లో లవ్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా అని అడిగింది. ఇందులో భాగంగా జబర్దస్త్ రోహిణి మొదటిసారి తన లవ్ స్టోరీ గురించి ఓపెన్ అయింది. "తాను సిన్సియర్ గా ఓ వ్యక్తిని లవ్ చేశానని, ఒక 8 నెలలు ట్రావెల్ అయ్యాక అతనికి ఆల్రెడీ ఒక లవర్ ఉందని తెలిసింది" అని చెబుతూ ఎమోషనల్ అయ్యింది రోహిణి. ప్రస్తుతం రోహిణి మాటలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక ఆమె లవ్ స్టోరీ ఏంటనేది [పూర్తిగా తెలియాలంటే సన్ డే ఎపిసోడ్ చూడవచ్చు. మరి రోహిణి పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి. View this post on Instagram A post shared by Rohini (@actressrohini)