తమ్మారెడ్డి భరద్వాజ.. సినీ పెద్దగా.. నిర్మాతగా.. ఓ దర్శకుడిగా తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇండస్ట్రీకి సంబంధించిన ఏ విషయల గురించైనా ముక్కు సూటిగా మాట్లాడటం ఆయనకు అలవాటు. మూవీ షూటింగ్ లు ఆపటం తప్పు అని చెప్పి వార్తల్లో నిలిచారు. ఇక తాజాగా సుమన్ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో హీరో నిఖిల్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. ఇండస్ట్రీలో ఏదైనా సినిమా రిలీజ్ కావాలి అంటే ఎన్నో అడ్డంకులను దాటుకోవ్వాల్సి ఉంటుంది. మూవీకి థియేటర్లు దొరకవు, పైగా పైరసీ భూతం.. లాంటి మరికొన్ని సమస్యలను దాటాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే హీరో నిఖిల్ నటించిన కార్తికేయ2 సినిమాకు థియేటర్లు దొరకనివ్వడం లేదని నిఖిల్ తన ఆవేదనను మీడియాతో పంచుకున్నాడు. థియేటర్ల కొరతకు కారణం ప్రముఖ నిర్మాత దిల్ రాజే అని నిఖిల్ భాహటంగానే చెప్పాడు. ఇప్పుడు ఇదే విషయంపై ప్రముఖ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ నిఖిల్ పై మండిపడ్డారు. చిన్న సినిమాగా విడుదలైన కార్తికేయ2 భారీ వసూళ్లను సాధించడంపై మీ అభిప్రాయం ఏంటని యాంకర్ ప్రశ్నించగా.. ఆయన ఈ విధంగా స్పందించారు.." అసలు చిన్న సినిమా అని ఎవరు అన్నారు? అది మనం అనుకున్నదే.. ఇక థియేటర్ల గొడవ విషయానికి వస్తే ఎవరికి దమ్ము ఉంటే వారు ముందుకు రావాలి గానీ థియేటర్లు దొరకనివ్వడంలేదు అని ఇతరులను విమర్శించడం తప్పు. అలాగే కార్తికేయ2 సినిమాకు దిల్ రాజు థియేటర్లు ఇవ్వనప్పుడు అతడిని సక్సెస్ మీట్ కు ఎందుకు పిలిచినట్టు అంటూ మడ్డిపడ్డారు. ఆ రోజు స్టేజిపై దిల్ రాజు మట్లాడుతుంటే మైక్ గుంజుకుని ఇది తప్పు సార్ అని నిఖిల్ చెప్పొచ్చుగా ఎందుకు చెప్పలేదు? అసలు మూవీ రిలీజ్ విషయంలో హీరోకి సంబంధం ఏంటి? దిల్ రాజు ఇంటికి వెళ్లి అడుక్కొవ్వాల్సిన అవసరం ఏంటి? సినిమా సక్సెస్ అయినప్పుడు ఒకలా.. కానప్పుడు మరోలా మాట్లాడటం తగదని ఈ సందర్భంగా తెలిపాడు. ఇక హీరో పని హీరో చేసుకోవాలి.. నువ్వేం డబ్బులు తీసుకోకుండా సినిమాలు చేయం కదా అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. నీకు ధైర్యం ఉంటే థ్యాంక్యూ మూవీకి పోటీగా నీ మూవీని రిలీజ్ చేయాల్సిందిగా, ఎందుకు చేయలేదు అప్పుడు నీకు దమ్ము లేదా? అంటూ విమర్శించాడు. ఒక వేళ కార్తికేయ2 మరో లైగర్ అయ్యింటే ఏం చేసేవాడివి.. హీరోలు సక్సెస్ రాగానే కాలర్ ఎగిరేయడం తగ్గించాలి. ఇలాంటి బ్లేమ్ గేమ్స్ ఆపాలని ఆయన అన్నారు. నిర్మాతలు సినిమాలు తీసేది డబ్బు సంపాదించడానికే గానీ దేశాన్ని ఉద్దరించడానికి కాదని ఆయన స్పష్టం చేశారు. అందరి హీరోలకు హిట్ లు, ప్లాప్ లు కామన్ అని తమ్మారెడ్డి భరద్వాజ ఈ సందర్భంగా అన్నారు. మరి నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ హీరో నిఖిల్ పై చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన స్టార్ ఆల్రౌండర్