సినీ రంగంలో డేటింగ్ లు, ప్రేమలు, పెళ్లిళ్లు, విడాలకులు సర్వ సాధారణం. అయితే ఒకరితో ప్రేమలోనో, డేటింగ్ లోనో ఉంటే అంతగా అభిమానులు పట్టించుకోరు. కానీ ఒకరితో ప్రేమలో ఉండి, మాజీ ప్రియుడితో చెట్టా.. పట్టాల్.. వేసుకుని తిరిగితే చూసే వారికి కూడా వెగటుగానే ఉంటుంది. తాజాగా ఇలాంటి పనే చేసిన బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ సుస్మితా సేన్ నెటిజన్స్ నుంచి విమర్శలకు గురి అవుతోంది. ఈ వార్తకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. సుస్మితా సేన్.. బాలీవుడ్ మోస్ట్ లేడీ బ్యాచిలర్ లలో ఒకరు. గత కొన్ని రోజుల నుంచి సుస్మిత పేరు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఈ అమ్మడు రోహ్మన్ షాల్ తో బ్రేకప్ చెప్పుకున్నాక.. ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోదీతో రిలేషన్ లో ఉన్నట్లు తెలిపింది. అందుకు తగ్గట్లే వారిద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను సైతం సోషల్ మీడియాలో షేర్ చేసింది. దాంతో అప్పట్లో ఈ పిక్స్ బాలీవుడ్ లో రచ్చలేపాయి. అయితే అంతా బాగానే ఉంది అనుకునే లోపే మళ్లీ సుస్మితా సేన్ తన మాజీ ప్రియుడు రోహ్మన్ తో కలిసి కొన్ని రోజుల క్రితం కారులో కనిపించింది. మళ్లీ ఇప్పుడు షాపింగ్ చేస్తూ ఇద్దరూ మీడియా కంట పడ్డారు. దీంతో సుస్మితాసేన్ లలిత్ మోదీకి గుడ్ బై చెప్పిందా? అంటూ నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. అదీ కాక తమ అభిమాన నటి ఇలా దిగజారి ఇద్దరితో కలిసి ఇలా ఉండటాన్ని వారు జీర్ణించుకోలేక పోతున్నారు. దాంతో సుస్మిత పై ఫైర్ అవుతున్నారు. ఇదిలా ఉండగా.. సుస్మిత సన్నిహితులు మాత్రం రోహమన్ తో కలిసి కనిపించడానికి కారణాలను వెల్లడిస్తున్నారు. సుస్మితాసేన్-రోహమన్ డేటింగ్ లో ఉన్నప్పుడు దత్తత తీసుకున్న పిల్లలను కలిసి పెంచుకున్నారు. ఇప్పుడు వారి అవసరాల కోసమే షాపింగ్ చేస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. మరి లలిత్ మోదీ ఉండగా రోహమన్ ఎందుకు? మోదీనే తీసుకుని షాపింగ్ కు వెళ్లోచ్చుగా అంటూ పలువురు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి సుస్మితాసేన్ ప్రేమాయణంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Sushmita Sen (@sushmitasen47) Just for clarity. Not married - just dating each other. That too it will happen one day. pic.twitter.com/Rx6ze6lrhE — Lalit Kumar Modi (@LalitKModi) July 14, 2022 ఇదీ చదవండి: Mahesh Babu: ఇక నుంచి బుల్లితెరపై కూడా మహేశ్ సందడి.. షోలు ఇంటర్వ్యూలతో! ఇదీ చదవండి: దీపిక పిల్లి లక్ రివర్స్.. ఆఖరి నిమిషంలో ఆమె స్థానంలో బిగ్ బాస్లోకి మరో బ్యూటీ!