దక్షిణ భారత సినిమాల్లో విజయవంతమైన నటీమణులలో మీనా దురైరాజ్ ఒకరు. మీనా సెప్టెంబర్ 16, 1977 న చెన్నైలో జన్మించింది. ఆమె 8 వ తరగతి చేస్తున్నప్పుడు 13 సంవత్సరాల వయస్సులోనే హీరోయిన్ అయ్యారు. మీనా తండ్రి దురైరాజ్ తమిళనాడులో స్థిరపడిన తెలుగు కుటుంబానికి చెందిన వారు. ఈయన తమిళనాడు ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేశాడు. ఈమె తల్లి రాజమల్లిక కూడా అలనాటి తమిళ సినిమా నటి. ఆమెతో సినిమా డేట్లు కావాలని ఎవరైనా అడిగితే ముందుగా మీనా వాళ్ళ అమ్మ ని సంప్రదించాల్సిందేనట. అప్పుడు మీనా వాళ్ళ అమ్మ ఎప్పుడు ఎలా చేయాలో చెప్తే అలాగే మీనా కూడా చేసేదట. అలా వాళ్ళ అమ్మ మాట విని ఎన్నో సక్సెస్ ఫుల్ సినిమాలను వదులుకుందట మీనా.
తెలుగులో వెంకటేష్, మీనా జంటగా సుందర కాండ, చంటి, సూర్య వంశం, అబ్బాయిగారు వంటి సూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. అక్కినేని నాగేశ్వరావు గారు నటించిన సీతారామయ్యగారి మనవరాలు చిత్రంతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది. ఇక ఈ సినిమాకు గాను ఆమె నంది అవార్డును కూడా అందుకుంది. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలలో తన అందం అభినయం, నటనతో ప్రేక్షకులను మెప్పించింది. అంతేకాకుండా అప్పట్లో స్టార్ హీరోల సరసన నటించి సార్ హీరోయిన్ హోదాను దక్కించుకుంది.
ముఖ్యంగా అప్పట్లో అగ్రహీరోలు అయినటువంటి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ వంటి స్టార్ హీరోల సరసన నటించింది. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక చెరగని ముద్ర వేసుకుంది. అలా ఇండస్ట్రీలో ఏళ్ళపాటు సక్సెస్ఫుల్ హీరోయిన్గా చలామణి అయ్యింది. అయితే మీనా ను తన తల్లి కఠినమైన రూల్స్ ని పెట్టి ఇండస్ట్రీలోకి పంపించారట . అందులో రెండు అతి ముఖ్యమైన సినిమాలను వదులుకున్న ఎందుకు మీనా ఇప్పటికి కూడా బాధపడుతూనే ఉందట.
మీనా వదులుకున్న సినిమాలు ఏవో తెలిస్తే మీరూ ఆశ్చర్యపోతారు… కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా, అలాగే హీరోయిన్ రమ్యకృష్ణ నటించిన నరసింహ సినిమా. నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర మొదటి మీనాకు వచ్చింది. కానీ మీనా వాళ్ళ అమ్మ మీనా డేట్స్ కుదరదు అని చెప్పడం తో ఈ సినిమాను కూడా మిస్ చేసుకుంది.