బోల్డ్‌ బ్యూటీలతో కాంట్రవర్సీ కింగ్‌ రామ్ గోపాల్‌ వర్మ

RGV with Ashureddy ariyana

కాంట్రవర్సీ కింగ్‌ ఆర్జీవీ చాలాకాలంగా బోల్డ్‌ ఆర్జీవీగా మారిపోయాడు. బోల్డ్‌ బ్యూటీలతో చిందులు, డేట్‌లు, పార్టీలు, లైఫ్‌ అంటే నీది కదా సామీ అంటూ నెటిజన్లు కుళ్లుకునేలా ఎంజాయ్‌ చేస్తున్నాడు. తాజాగా తన బోల్డ్‌ బ్యూటీల లిస్ట్‌లోకి చేరిన అషూరెడ్డి.. యూట్యూబ్‌లో బాగానే వైరల్‌ అయ్యింది. ఈసారి ఇంటర్వ్యూలు కాదులే గానీ, ఫొటోలతో సరిపెట్టేశాడు ఆర్జీవీ. అషూరెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా బోల్డ్‌ బ్యూటీలు అరియానా గ్లోరీ, అషూరెడ్డిలతో కలిసి దిగిన ఫొటోలను పోస్ట్ చేశాడు. తర్వాత ఏమైద్దో తెలుసుగా? అదే సోషల్‌ మీడియా వైరల్‌గా మారాయి.

అషూరెడ్డి బర్త్‌డే పార్టీలో పాల్గొన్న ఆర్జీవీ అరియానా, అషూరెడ్డితో దిగిన ఫొటోలను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్‌ చేశాడు. కానీ, ఆ ఫొటోలను అషూరెడ్డి, అరియానా తమ ఇన్‌స్టాలో పెట్టకపోవడంపై అభిమానులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ‘మరింత మంది యువతులు అరియానా, అషూరెడ్డిల కన్నా బోల్డ్‌ అండ్‌ హానెస్ట్‌గా మారాలి. బ్యూటీల ముఖాలను, నా బూట్లను మాత్రం మిస్‌ కాకండి’ అని ఒక ఫొటో, ‘పార్టీ తర్వాత బోల్డ్‌ గార్ల్స్‌ అరియానా, అషూరెడ్డిలతో.. వారి నిజాయితీని ఆరాధిస్తున్న నేను’ అని మరో ఫొటోని షేర్‌ చేశాడు ఆర్జీవీ.