ప్రణీత సుభాష్.. ఒకప్పడు స్టార్ హీరోయిన్‌గా మెరిసిన ఈ అమ్మడు ప్రస్తుతం పర్సనల్ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. గుండ్రంగా పెద్ద పెద్ద కళ్లతో చూడగానే కట్టిపడేసి అందం ఆమె సొంతం. ఎన్నో సినిమాలు వచ్చినా హీరోయిన్‌గా మాత్రం ఇండస్ట్రీలో నిలదొక్కుకోలేకపోయింది. ఆమె నటించిన సినిమాలు హిట్టు కొట్టినా అవి ఆమె కెరీర్‌ను నిలబెట్టుకునేందుకు దోహదం చేయలేకపోయాయి. కెరీర్‌లో అవకాశాలు తగ్గిన తర్వాత పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీకి దూరంగా గడిపేస్తోంది. తర్వాత ఆమెకు పాప పుట్టడం కెరీర్ మరింత గ్యాప్ రావడం చూశాం. 2021లో భుజ్ సినిమాలో కనిపించి మెప్పించింది. ఈ మధ్యకాలంలో చాలావరకు తన పాత ఫొటోలను షేర్ చేస్తూ ఆ రోజులకు మళ్లీ వెళ్లాలని ఉంది అంటూ కామెంట్ చేస్తూ వచ్చింది. అయితే ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) ప్రణీత రీ ఎంట్రీ ఇప్పటికే కన్ఫార్మ్ అయిపోయింది. ఇప్పటికే కన్నడలో ఓ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఆ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. అయితే ఇప్పుడు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు, తన ఫాలోయింగ్‌ను మరింత పెంచుకునేందుకు ప్రణీత ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ విషయాన్ని చెప్పకనే తన ఇన్‌స్టాగ్రామ్ పోస్టుతో చెప్పేసింది. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) అదేంటంటే.. సినిమాల్లో హీరోయిన్‌గా నటించినప్పటి రోజులను గుర్తుచేస్తున్నట్లుగా ఉంది. గ్రీన్ సూట్, టూ పీస్ కాస్ట్యూమ్‌లో ప్రణీత హొయలు పోతూ వాకింగ్ చేస్తుంటే అభిమానుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రణీత ఈజ్ బ్యాక్, బ్యాక్ టూ యాక్షన్ అంటూ కామెంట్లతో హెరెత్తిస్తున్నారు. ప్రణీత వీడియో, ఫొటోలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) ఇదీ చదవండి: మహేష్-నాగార్జున కాంబోలో మల్టీస్టారర్? వైరల్ అవుతోన్న నాగ్ ట్వీట్.. ఇదీ చదవండి: బాలీవుడ్‌లో జోరు పెంచిన తమన్నా.. లస్ట్ స్టోరీస్‌లో ఛాన్స్!