ఏ చిత్ర పరిశ్రమలోనైనా మల్టీస్టారర్ కు ఉన్న క్రేజే వేరు. ఇద్దరు స్టార్ హీరోలు కలిసి నటిస్తున్నారు అంటే చాలు ఆ చిత్రంపై భారీ అంచనాలు నెలకొంటాయి. ఇక 80, 90 దశకాల్లో మల్టీస్టారర్ చిత్రాలకు కొదవలేదు. అప్పట్లో ఎన్టీఆర్, ఏఎన్నార్, శోభన్ బాబు, కృష్ణా లాంటి అగ్ర కథానాయకులు వరుసగా మల్టీస్టారర్ మూవీలను చేసేవారు. కాల క్రమేనా ఈ సాంప్రదాయం తగ్గింది. అయితే ఇటీవలి కాలంలో మళ్లీ ఈ తరహ చిత్రాలకు ఊహించని రెస్పాన్స్ వస్తుండటంతో హీరోలు మల్టీస్టారర్ చిత్రాలకు ఆసక్తి చూపిస్తున్నారు. తాజాగా ఇద్దరు అగ్ర హీరోలు కలిసి నటించబోతున్నారు అనే వార్త తెలుగు ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. దీనికి సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే.. నాగార్జున.. టాలీవుడ్ మన్మథునిగా తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు. ఏఎన్నార్ నట వారసునిగా వచ్చినప్పటికీ తనదైన నటనతో అభిమానుల హృదయాల్లో నిలిచిపోయాడు. ఇక తాజాగా నాగ్ హీరోగా నటించిన 'ది ఘోస్ట్' ట్రైలర్ ను సూపర్ స్టార్ మహేష్ బాబు ట్వీటర్ ద్వారా రిలీజ్ చేశాడు. ఈ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టు కుంటోంది. ఈ మూవీ మేకింగ్ హాలీవుడ్ రేంజ్ లో ఉందంటూ ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ సందర్భంగా నాగ్ స్పందిస్తూ..'' హే మహేష్ ది ఘోస్ట్ ట్రైలర్ విడుదల చేసినందుకు థ్యాక్యూ..! 29 ఏళ్ల క్రితం వారసుడు చిత్రంలో మీ నాన్నగారు సూపర్ స్టార్ కృష్ణతో కలిసి నటించడం చాలా ఆనందంగా అనిపించింది. మరి మనం కలిసి సినిమా ఎందుకు చేయకూడదు?'' అంటూ రాసుకొచ్చాడు. ఇక ఈ దీనికి మహేష్ రిప్లై ఇస్తూ.. ''కచ్చితంగా చేద్దాం.. దానికి కోసం వేచి చూస్తున్నాను'' అంటూ స్పందించాడు. ఈ ట్వీటర్ సంభాషనలను చూసిన ఇద్దరి అభిమానులు తెగ మురిసి పోతున్నారు. ఎప్పుడెప్పుడు తమ హీరోలిద్దరిని ఒకే స్క్రీన్ పై చూద్దామా అని ఎదురు చూస్తున్నామని కొందరు నెటిజన్స్ చెప్పుకొచ్చారు. ది ఘోస్ట్ ట్రైలర్ పై మహేష్ ప్రశంసలు కురింపించాడు. '' ఈ ట్రైలర్ రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. అద్బుతంగా, గ్రిప్పింగ్ గా ట్రైలర్ ను తీర్చిదిద్దారు. చిత్ర యూనిట్ మెుత్తానికి నా అభినందనలు అలాగే ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు. ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే ప్రవీణ్ ఓ అభిరుచిగల దర్శకుడిగా తెలుగు పరిశ్రమలో మంచి పేరు తెచ్చుకున్నాడు. మరి ఈ క్రమంలో నాగ్- మహేష్ కాంబోలో మూవీ ప్రేక్షకులకు పండగే అని చెప్పాలి. మరి ఈ కాంబినేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. Hey @urstrulyMahesh !! I was so happy 29 years ago when your father SuperStar Krishna Garu joined me for the film Varasudu !! Why don’t we complete the circle Thank you for releasing #TheGhostTrailer https://t.co/cbgu8vtpH1 — Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2022 Would be an absolute pleasure... now that would be something to look forward to! ♥️ — Mahesh Babu (@urstrulyMahesh) August 25, 2022 ఇదీ చదవండి: Nithya Menen: ఇండస్ట్రీలో లేకుండా చేద్దామని చూశారు: నిత్యామీనన్ ఇదీ చదవండి: Srinu Vaitla: శ్రీనువైట్ల భావోద్వేగం.. బరువెక్కిన హృదయంతో వీడ్కోలు!