ఇండియాలో టాప్ మోస్ట్ స్టార్ హీరోల్లో బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ కూడా ఒకడు. సినిమానే నమ్ముకుని.. ఎంతో కష్టపడి షారుక్ ఎదిగిన తీరు ఎందరికో ఆదర్శం. సాధారణంగా సినిమాల విడుదల, ప్రమోషన్స్ వంటి విషయాల్లోనే వార్తల్లో నిలిచే కింగ్ ఖాన్.. ఇటీవల కొడుకు ఆర్యన్ ఖాన్ విషయంలో చాలారోజులు వార్తల్లో నలిగిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ కేసులో ఆర్యన్ ఖాన్ కు క్లీన్ చిట్ వచ్చిన సంగతీ తెలిసిందే. అయితే మరోసారి షారుక్ ఖాన్ కు పోలీసులు నోటీసులు ఇచ్చారు. అయితే ఈసారి నోటీసులు ఇచ్చింది మాత్రం క్రిమినల్ కేసులు వంటి వాటిలో కాదులెండి.
విషయం ఏంటంటే.. షారుక్ ఖాన్ కు తాను నివసించే మన్నత్ నిలయం అంటే ఎంతో ఇష్టం. ఎప్పటికప్పుడు మరమ్మతులు చేయించడం మొదలు ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆక్రమంలోనే ఇంటికి ఒక కొత్త నేమ్ బోర్డు పెట్టాలని ఈ బాద్ షా ఫిక్స్ అయ్యాడు. అనుకున్నదే తడవుగా రూ.25 లక్షలు ఖర్చు పెట్టి ఆ నేమ్ బోర్డ్ తయారు చేయించారు. షారుక్ భార్య గౌరీ ఖాన్ దగ్గరుండి ఈ బోర్డు డిజైన్ చేయించారంట.
The iconic #Mannat nameplate has been missing from outside #ShahRukhKhan‘s Mumbai house for some days. Did you notice? And do you know why? We find out.
Read 👉 https://t.co/xBH5AzkuDj
Story by @RishabhSuri02 pic.twitter.com/86fcZxVRot— HT City (@htcity) May 27, 2022
రూ.25 లక్షలు ఖర్చుపెట్టారు అనే విషయం బయటకు రాగానే ఒక్కసారిగా ఈ నేమ్ బోర్డు వార్తల్లో నిలిచింది. యూరప్ నుంచి ఒక ప్రత్యేకమైన రాయిని తెప్పించి ఈ నేమ్ బోర్డును తయారు చేశారు.. అందుకే అంత కాస్ట్ అంట. అయితే ఈ బోర్డును దొంగలు అపహరించే అవకాశం కూడా లేకపోలేదు. అందుకే పోలీసులు ముందుగానే జాగ్రత్తపడి అక్కడ కానిస్టేబుళ్లను కాపాలా పెట్టారంట.
అయితే ఆ ఇంటికి అలా కాపలా పెట్టడం పోలీసులకు ఇబ్బందిగా మారడంతో ఓ నిర్ణయానికి వచ్చారు. మీ ఇంటికి పెట్టిన నేమ్ బోర్డు తొలగించండి అంటూ షారుక్ ఖాన్ కు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ నోటీసుల్లో ఇంకో విషయం కూడా క్లియర్ గా చెప్పారంట. ఆ నేమ్ బోర్డు మీరు తొలగించకపోతే.. స్వయంగా మేమే తొలగిస్తాం అంటూ చొప్పుకొచ్చారంట. ఆ నోటీసులు అందుకున్న కింగ్ ఖాన్ చేసేది లేక తన ఇంటికి పెట్టిన కొత్త నేమ్ బోర్డు తొలగించాడంట. షారుక్ ఖాన్ కు పోలీసులు నోటీసులు ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Mumbai: Last month, Bollywood‘s badshah Shah Rukh Khan’s house Mannat was trending on social media after fans noticed that the house got a new nameplate. The classy and chic nameplate which reportedly costed around Rs. 20-25 Lakh had become the hot topic as netizens went gaga ove pic.twitter.com/HEPwRUSZ7s
— Deccan News (@Deccan_Cable) May 28, 2022