హీరో విశ్వక్ సేన్ తన అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా ప్రమోషన్ కోసం చేసిన ప్రాంక్ వీడియో సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు.. పైగా అది ఇప్పట్లో ముగిసేలా లేదు. ప్రాంక్ వీడియో కన్నా కూడా.. దానిపై టీవీ స్టూడియోలో జరిగిన డిబేట్.. ఆ క్రమంలో చోటు చేసుకున్న సంఘటనలు మరింత సంచలనంగా మారాయి. విశ్వక్ సేన్, యాంకర్ దేవి నాగవల్లిల మధ్య చోటు చేసుకున్న వివాదం రెండు తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో నెటిజనులు రెండు వర్గాలుగా విడిపోయి.. దీనిపై సోషల్ మీడియా వేదికగా చర్చ జరుపుతున్నారు. ఈక్రమంలో కొందరు విశ్వక్ సేన్ వాడిన పద జాలాన్ని తప్పు పడుతున్నారు. దేవి నాగవల్లి ధైర్యంగా వ్యవహరించిందని ప్రశంసిస్తున్నారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సహా పలువురు దేవి ధైర్యంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ క్రమంలో గతంలో దేవి మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం వైరలవుతోంది.
ఇది కూడా చదవండి: Karate Kalyani: విశ్వక్ సేన్ vs దేవి నాగవల్లి వివాదం.. అనసూయని లాగిన కరాటే కళ్యాణి!
దేవి నాగవల్లి అంటేనే ధైర్యానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉంటుంది. దేని గురించి అయినా సరే ఏమాత్రం తొణక్కుండా.. ముక్కుసూటిగా మాట్లాడే ఆమె తత్వం అంటే చాలా మందికి ఇష్టం. ఈ క్రమంలో దేవి నాగవల్లి.. తెలుగు బిగ్ బాస్ 4లో కంటెస్టెంట్గా వెళ్లింది. అప్పుడే ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు ప్రేక్షకులకు తెలిసి వచ్చాయి. ఇక బిగ్ బాస్ షోకు వెళ్లడానికి ముందు దేవి అభిమానుల కోసం సోషల్ మీడియాలో ఓ వీడియోని పోస్ట్ చేసింది. దీనిలో ఆమె తన వృత్తి, వ్యక్తిగత విషయాల గురించి వెల్లడించింది. ముఖ్యంగా వార్తలను ప్రజెంట్ చేసే విషయంలో తను ఇంత స్థిరంగా ఎలా ఉండగల్గుతుందో వివరించింది. తాను ఇలా డిటాచ్డ్గా.. ఎమోషన్స్ లేకుండా మారడం వెనక ఓ చిన్న సంఘటన ఉందని వెల్లడించింది.
ఇది కూడా చదవండి: Devi Nagavalli – Vishwak Sen: దేవి – విశ్వక్ వివాదంలోకి బాబు గోగినేని! పోస్ట్ వైరల్!
ఓ వార్తను ప్రజెంట్ చేసే విషయంలో తాను ఒక వైపు మాత్రమే చూశానని.. ఆ తర్వాత అసలు వాస్తవం తెలిసిందన్నారు. దాంతో తాను చాలా బాధపడ్డానని.. రెండు రోజుల పాటు తిండి తిప్పలు మానేసి మరి ఏడుస్తూ కూర్చున్నాను అని చెప్పుకొచ్చింది. అంతేకాక.. తన జాబ్ ప్రొఫైల్ ఎలా ప్రారంభం అయ్యింది.. ఆ పరిస్థితులను ఎలా ఎదుర్కొన్నాను వంటి తదితర వివరాలను వెల్లడించింది దేవి నాగవల్లి. బిగ్బాస్ 4కు వెళ్లడానికి ముందు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం మరోసారి వైరలవుతోంది. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: Kajal Aggarwal: సినిమాలకు దూరం కాబోతున్న కాజల్.. కంగారులో ఫ్యాన్స్!