రాడిసన్ హోటల్, పబ్ వ్యవహారం ఎన్నో మలుపులు తిరింగింది. కొందరి అత్యుత్సాహం వల్ల డ్రగ్స్ వ్యవహారంతో సంబంధంలేని చాలా మంది పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. వారిలో మెగా డాటర్ నిహారిక కూడా ఒకరు. వార్తలు బయటకు వచ్చిన కాసేపటికే మెగా బ్రదర్ నాగబాబు సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. నిహారిక ఎందుకు అక్కడకు వెళ్లింది. అసలు ఏం జరిగింది అనే దానిపై క్లారిటీ ఇచ్చారు. తప్పుడు ప్రచారాలు చేయకండని విజ్ఞప్తి చేశారు. కానీ, కొందరు అదే పనిగా నిహారిక పేరును వాడుతుండటంతో నాగబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: ఏపీలో KGF-2 మూవీకి టికెట్ రేట్లు పెరగనున్నాయా..?
నాగబాబు ఆయన సోషల్ మీడియా ఖాతాల్లో ఓ వీడియో పోస్ట్ చేశారు. అది బాహా మెన్ ‘హూ లెట్ ద డాగ్స్ అవుట్’ సాంగ్ వీడియో. నిహారికను టార్గెట్ చేసి పరువు తీసేలా కామెంట్స్, అసత్య ప్రాచారాలపై చేస్తున్న వారికి కౌంటర్ గా నాగబాబు ఈ వీడియో పోస్ట్ చేశారని భావిస్తున్నారు. అలాంటి వారిని ఇన్ డైరెక్ట్ గా కుక్కలతో పోల్చారని అభిమానులు కామెంట్ చేస్తున్నారు. నాగబాబు పోస్ట్ చేసిన వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.