ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లోని సినిమా అభిమానులు ఎంతో ఆతురతగా ఎదురుచూస్తున్న చిత్రం ఆచార్య. చాలా గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి స్క్రీన్ షేర్ చేసుకున్న సినిమా ఇది. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఆచార్య మూవీ ఏప్రిల్ 29న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. చిత్ర బృందం జోరుగా సినిమా ప్రమోషన్స్ నిర్వహిస్తోంది. కొరటాల శివతో కలిసి చిరంజీవి ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో సినిమా గురించి ఎన్నో ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా మహేశ్ బాబు ఈ సినిమాకి వాయిస్ ఓవర్ చెప్పేందుకు ఎలా ఒప్పుకున్నారు. అసలు మహేశ్ తో మెగాస్టార్ కున్న అనుబంధం గురించి చెప్పుకొచ్చారు. ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఇంటర్వ్యూని ఈ కింది వీడియోలో మీరూ చూసేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.