కాఫీ విత్ కరణ్.. బాలీవుడ్ లో ఈ షో ఎంతో పాపులర్ అని అందరికీ తెలుసు. ఇది సక్సెస్ ఫుల్ గా 6 సీజన్లు కంప్లీట్ చేసుకుని ఇప్పుడు 7 సీజన్లోకి అడుగు పెట్టింది. ఈ షోకి వచ్చే అతిథులను తికమక, ఇరకాటంలో పెట్టే ప్రశ్నలు అడుగుతాడు కరణ్ జోహార్. అయితే ఈ షోలో కొన్నిసార్లు శ్రుతిమించిన ప్రశ్నలు కూడా వస్తుంటాయి. అలాంటి ప్రశ్నే ఒకటి కరీనా, ఆమిర్ ఖాన్లకు ఎదురైంది. ‘లాల్ సింగ్ చడ్డా’ సినిమా ప్రమోషన్ లో భాగంగా కాఫీ విత్ కరణ్ షోకి ఆమిర్ ఖాన్, కరీనా వెళ్లారు. ఇంటర్వ్యూలో భాగంగా శృంగారానికి సంబంధించిన ప్రశ్నను కరణ్ జోహార్ అడిగాడు. “పిల్లలు పుట్టిన తర్వాత సె**క్స్ లైఫ్ క్వాలిటీగా ఉంటుంది అనేది నిజమా? భ్రమేనా?” అంటూ ప్రశ్నించాడు. వెంటనే బెబో ఏమాత్రం ఆలోచించుకోకుండా మీకు తెలియదా అంటూ తిరిగి ప్రశ్నించింది. కరీనా నుంచి ఆ ప్రశ్నను ఊహించని కరణ్ జోహార్ దెబ్బకు తెల్ల మొహం వేశాడు. వెంటనే “మా అమ్మ ఈ షో చూస్తుంటుంది. నా జీవితానికి సంబంధించిన విషయాన్ని ఇలా అడిగితే ఆమె ఏమనుకుటుంది?” అంటూ ప్రశ్నించాడు. అందుకు ఆమిర్ ఖాన్ “నీ శృంగార జీవితానికి సంబంధించి మాట్లాడితే మీ అమ్మ ఫీలవుతారు. కానీ, వేరే వాళ్లకి సంబంధించి అడిగితే ఏమనుకోరా” అంటూ ఆమిర్ కూడా కౌంటర్ వేశాడు. కరణ్ జోహార్ అడిగిన ప్రశ్నపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: బ్రా కనబడితే తప్పేంటి? అలియా భట్ సంచలన వ్యాఖ్యలు! ఇదీ చదవండి: మహేష్ న్యూ లుక్ అదిరిపోయిందిగా.. Next గుబురు గడ్డం, మీసమేనా?