ఓడిపోయి ఏడవడం దేనికి? ప్రకాశ్ రాజ్ ప్యానెల్‌పై నరేశ్ ఘాటు వ్యాఖ్యలు!

Naresh

‘మా’ ఎన్నికలు ముగిసినా.. ఎన్నికలతో రాజుకున్న మంట ఇంకా రగులుతూనే ఉంది. మా నూతన అధ్యక్షుడిగా విష్ణు ప్రమాణస్వీకారం చేశాడు. మొదటి సంతకం పింఛన్ల ఫైల్‌పై పెట్టాడు. మరోవైపు గత అధ్యక్షుడు నరేశ్‌ కూడా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై కాస్త ఘాటుగా స్పందించాడు. ప్రకాశ్‌రాజ్‌ ప్యానల్‌ వాళ్లు రాజీనామా చేయడంపై నరేశ్‌ సెటైర్లు వేశారు.

‘గెలిచినా, ఓడినా మాలోనే ఉంటాం అన్నారు. ఇప్పుడు ఎందుకు రాజీనామా చేసి మాటతప్పుతున్నారు. కలిసి పనిచేద్దాం అనే చెప్తున్నాం కదా.. బయటి నుంచి ప్రశ్నించేదెందుకు. మోదీగారు గెలిచారని కాంగ్రెస్‌ వాళ్లు దేశం విడిచిపెట్టి వెళ్లలేదు కదా. ప్యానల్‌లో మీరు కూడా ఉన్నారు. విడిపోదామనుకుంటే మీ ఇంగిత జ్ఞానానికే వదిలేస్తున్నా. కొందరైతే ముండ మోసిన వాళ్లలా ఏడుస్తున్నారు. అతిగా ఏడ్చే మగాళ్లని నమ్మకూడదు అంటారు. ఎందుకు అలా ఏడుస్తున్నారు. బయటి నుంచే ప్రశ్నిస్తాం అంటే.. ఈసారి వచ్చినన్ని ఓట్లు కూడా రావు ఈసారి. ఎన్నికలు జరగకూడదు అనేదే మా ప్రయత్నం’ అంటూ నరేశ్‌ ఒకింత ఘాటుగా.. మరోవైపు ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేశాడు.

ఇదీ చదవండి: మా అన్నయ్య అలాంటి వ్యక్తి కాదు.. నాగబాబు ఎమోషనల్ కామెంట్స్!