ప్రస్తుతం దేశవ్యాప్తంగా ‘RRR’ మేనియా నడుస్తోంది. థియేటర్లు, సోషల్ మీడియా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే టాకు. ఇంక కలెక్షన్ల విషయానికి వస్తే బాక్సాఫీసు వద్ద సునామీ అనే చెప్పాలి. రాజమౌళి, రామ్ చరణ్, తారక్ ముగ్గురు ప్రస్తుతం సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నారు. వీళ్ల ముగ్గురే కాదు.. సినిమాకి పనిచేసిన అందరూ ఫుల్ బిజీగా మారిపోయారు. తెలుగు నటీనటులు, ఆర్టిస్టులకు ఎంత క్రేజ్ వచ్చిందో బ్రిటీష్ పాత్రల్లో కనిపించిన హాలీవుడ్ యాక్టర్లకు అంతే క్రేజ్ వచ్చింది. వారిలో ముఖ్యంగా ఇండియన్ సినిమాకు సుపరిచితుడైన ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్ ఒకడు.
ఇదీ చదవండి: అసాధారణ రికార్డు సాధించిన RRR.. ఇండియన్ సినిమా గర్వపడేలా!
ఎడ్వర్డ్ సొన్నెన్ బ్లిక్ భారతీయ చిత్రాల్లో నటించడం కొత్తేం కాదు. సౌత్ సినిమాల్లోనూ నటించిన అనుభవం ఉంది. అతను హిందీ కూడా బాగా మాట్లాడగలడు. తెలుగు రాకపోయినా కూడా నటనలో ప్రేక్షకులను మెప్పించాడు. ఆ హాలీవుడ్ యాక్టర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. ‘ఎన్టీఆర్– రామ్ చరణ్ క్రేజ్, వాళ్ల ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి నేను ఆశ్చర్యపోయాను. వాళ్లిద్దరూ ఎంతో ప్రొఫెషనల్ గా ఉంటారు. వారి చుట్టూ ఉన్న వారిని కూడా అంతే ట్రీట్ చేస్తారు. రాజమౌళి సార్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో నటించడం మంచి అనుభూతిని ఇచ్చింది’ అంటూ సొన్నెన్ బ్లిక్ రామ్ చరణ్- ఎన్టీఆర్‌పై ప్రశంసలు కురిపించాడు. సొన్నెన్ బ్లిక్ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.