దీప్తి బ్రేకప్ చెప్పినా.. షణ్నూ అదే పని!

Shanmukh Post Viral on Deepthi Sunaina Birthday

యూట్యూబ్‌ స్టార్స్‌ దీప్తి సునయన-షణ్ముఖ్‌ల బ్రేకప్‌ ని వారి అభిమానులు ఇంకా జీర్ణంచుకోలేకపోతున్నారు. ఎంతో అన్యోనంగా కలిసి ఉండే ఈ జంట.. ఇలా విడిపోతారని ఎవరు ఊహించలేదు. కానీ బిగ్‌ బాస్‌ షోలో షణ్నూ, సిరితో హద్దులు దాటి ప్రవర్తించడం అటు ప్రేక్షకులతో పాటు.. ఇటు దీప్తి కూడా ఆమోదించలేకపోయింది. షో అయిపోయేంత వరకు అతడికి మద్దతుగా నిలిచింది. ఆ తర్వాత బ్రేకప్‌ చెప్పింది.

ఇది కూడా చదవండి : చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే ఉంటుంది: షణ్ముఖ్‌

Shanmukh Post Viral on Deepthi Sunaina Birthday

తమ బ్రేకప్‌ వార్తతో నూతన సంవత్సరానికి ఆహ్వానం పలికారు ఈ జంట. దీప్తి నిర్ణయం షణ్ముఖ్‌ కి నచ్చకపోయినా.. ఆమె సంతోషం కోసం అంగీకరిస్తున్నాను అని తెలిపాడు. ఇక తాజాగా షణ్నూ చేసిన ఓ పోస్ట్‌ సోషల్‌ మీడియాలో తెగ వైరలవుతోంది. నేడు దీప్తి సునయన పుట్టిన రోజు. ఈ సందర్భంగా ‘హ్యాపీ బర్త్‌డే డీ(D)’అంటూ దీప్తితో కలిసి దిగిన ఓ పాత ఫోటోను షణ్నూ తన ఇన్‌స్టా స్టోరీలో షేర్‌ చేశాడు. దీనికి వీరిద్దరు కలిసి నటించిన మలుపు వెబ్‌ సిరీస్‌ సాంగ్‌ను జత చేయడం విశేషం. ప్రస్తుతం ఈ పోస్ట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతుంది. అయితే దీనిపై దీప్తి ఇంతవరకు స్పందించలేదు.

ఇది కూడా చదవండి : దీప్తీతో బ్రేకప్‌ పై ఎట్టకేలకు స్పందించిన షణ్ముఖ్‌ జశ్వంత్‌