చనిపోయేటప్పుడు కూడా దీప్తి నా పక్కనే ఉంటుంది: షణ్ముఖ్‌

Deepthi and Shanmukh Kiss Video Viral

షణ్ముఖ్‌ జశ్వంత్‌– దీప్తి సునయన సోషల్‌ మీడియాలో ఈ జంటకున్నంత ఫాలోయింగ్‌ వేరే ఏ జంటకు లేదంటే అతిశయోక్తి కాదు. బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ముందు వరకు వీరిద్దరు ఎంతో అన్యోన్యంగా.. కలిసి మెలసి ఉన్నారు. కానీ షోలో షణ్ముఖ్‌ చేసిన అతి.. వీరి బంధానికి ఎండ్‌ కార్డ్‌ వేసింది. తామిద్దరి దారులు వేరు.. విడిపోతున్నామంటూ.. బ్రేకప్‌ వార్తతో కొత్త సంవత్సరానికి ఆహ్వానం పలికారు ఈ జంట. వీరి బ్రేకప్‌ వార్తని అభిమానులు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. మళ్లీ కలిస్తే బాగుండు.. అని కోరుకుంటున్నారు.

ఇది కూడా చదవండి : ఇక కలిసి ఉండలేం.. షణ్ముఖ్ కు బ్రేకప్ చెప్పిన దీప్తీ సునయన

ఈ క్రమంలో తాజాగా షణ్నూ, దీప్తిలకు సంబంధించిన పాత వీడియో ఒకటి ప్రస్తుతం తెగ వైరలవుతోంది. వీరిద్దరు జంటగా నటించిన హిట్‌ సాంగ్‌ ‘మలుపు’ మేకింగ్‌ వీడియోను యూట్యూబ్‌ లో రిలీజ్‌ చేశారు మేకర్స్‌. ఇందులో షణ్నూ, దీప్తి షూటింగ్‌ను ఎంతలా ఎంజాయ్‌ చేశారో, పాట కోసం ఎలా కష్టపడ్డారో చూపించారు. షణ్ను ఆస్పత్రి బెడ్‌పై పడుకుంటే.. దీప్తి అక్కడకు వచ్చి.. కొంచెం జరగమని.. అతడి ఎదపై పడుకుంది. దీంతో షణ్నూ ‘నేను చనిపోయేటప్పుడు కూడా దీప్తి ప్లేస్‌ ఇవ్వమని గొడవపడుతుంది, ఎందుకు జరగవని వాదిస్తుంది’ అని చెప్పడంతో దీప్తి నవ్వుతూ అతడి ఎదపై వాలిపోయింది.

Deepthi and Shanmukh Kiss Video Viral

ఇది కూడా చదవండి : నీ లక్ష్యాలను త్వరలోనే సాధిస్తావ్.. సిరి-శ్రీహాన్ సైతం విడిపోతారా?

ఆ తర్వాత షణ్ను ప్రేమగా దీప్తిని దగ్గరకు తీసుకుని ముద్దివ్వగా.. ఆమె కన్నార్పకుండా అతడిని అలానే చూస్తుండిపోయింది. ఇలా వీరిద్దరూ కలిసి ఉన్న క్షణాలను చూసి ఫ్యాన్స్‌ ఎమోషనల్‌ అవుతున్నారు. మీ జంట చూడముచ్చటగా ఉంది, వీడియో చూస్తుంటే చాలా బాధ కలుగుతుంది.. మీరిద్దరూ కలిసి నటించిన చివరి సాంగ్‌ ఇదే అవుతుందనుకోలేదు.. ఎంతో ప్రేమగా ఉండే మీరు మళ్లీ కలవాలి అని కోరుకుంటున్నాం అంటూ కామెంట్లు పెడుతున్నారు. కొన్ని రోజుల రియాలిటీ షోల కోసం మీ జీవితాలను పాడు చేసుకోకండి అని సూచిస్తున్నారు. కాగా శనివారం(జనవరి 8న) రిలీజ్‌ చేసిన మలుపు మేకింగ్‌ వీడియో ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్‌ అవుతోంది. వీరిద్దరి బ్రేకప్‌ పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.