జగన్‌తో చిరంజీవి అందుకే భేటీ అయ్యారు! రఘురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం సినిమా టిక్కెట్‌ ధరలను తగ్గించడంతో ఒక కొత్త వివాదం చెలరేగింది. సినీ ఇండస్ట్రీకి, ప్రభుత్వ పెద్దల మధ్య మాటామాట కూడా జరిగింది. ఈ నేపథ్యంలో మెగాస్టార్‌ చిరంజీవిని ఏపీ సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి ఆహ్వానించి, సినిమా టిక్కెట్లపై చర్చించడం ఆసక్తికరంగా మారింది. కాగా చిరంజీవి, సీఎం జగన్‌ భేటీపై ఎంపీ రాహురామకృష్ణంరాజు సంచలన వ్యాఖ్యలు చేశారు.

అక్రమాస్తుల కేసుల్లో ముఖ్యమంత్రి జగన్‌కు చేదోడువాదోడుగా ఉన్న నిరంజన్‌ రెడ్డి చిరంజీవి నటిస్తున్న ఆచార్య సినిమాకు నిర్మాత అని, అందుకే చిత్రపరిశ్రమకు న్యాయం చేయించేందుకు నిరంజన్‌ రెడ్డి ఈ భేటీని ఏర్పాటు చేశారని అన్నారు. మరి రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.