తెలుగులో బిగ్‌బాస్ షోకు విపరీతమైన క్రేజ్ ఉంది. అప్పటి వరకు ఓ వర్గం వారికి మాత్రమే తెలిసిన వారిని.. ప్రపంచానికి పరిచయం చేస్తుంది ఈ షో. సినీ సెలబ్రిటీలతో సమానమైన గుర్తింపు.. బిగ్‌బాస్ ద్వారా సాధ్యం అవుతుంది. ఇలా బిగ్‌బాస్ షో ద్వారా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నవారిలో సెట్ శ్వేత ఒకరు. బిగ బాస్ షో ద్వారా సెట్ శ్వేతా అలియాస్ శ్వేతా వర్మ గురించి అందరికి తెలిసింది. బిగ్‌బాస్ హౌజ్‌లో కూడా తన ప్రవర్తనతో ప్రేక్షకుల్లో మంచి మార్కులే కొట్టేసింది. సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్‌గా ఉంటుంది శ్వేతా వర్మ. ఈ క్రమంలో ఆమె ప్రస్తుతం చేసిన ఓ పోస్ట్ తెగ వైరలవుతోంది. ఆ వివరాలు..
ఇది కూడా చదవండి: ఈ చిన్నారిని గుర్తుపట్టారా? హౌస్ లో ఆమె ఇప్పుడు ఫైర్ బ్రాండ్!
శ్వేతా వర్మ సోషల్ మీడియాలో భావోద్వేగానికి లోనైంది. తనకు అవకాశం ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నారని ఆవేదన చెందింది. తనకు జరిగిన చేదు అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో అభిమానులతో షేర్ చేసుకుంది. ‘చాలా బాధగా ఉంది. నాకు ఛాన్స్ ఇచ్చి మళ్లీ వెనక్కు తీసేసుకున్నారు. నాకు ఇలా జరగడం ఇదే మొదటిసారేమీ కాదు. కానీ నాకు ఆశలు కల్పించి.. వెంటన్నే వాటిపై నీళ్లు చల్లడం భావ్యమా.. భరించలేకపోతున్నాను. వారం రోజుల వరకు సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని చెప్పుకొచ్చింది. కానీ కాసేపటికే ఆ పోస్టును తొలగించింది.
ఇది కూడా చదవండి: షణ్ముఖ్ నోటి దురద.. శ్వేత సీరియస్.. మధ్యలో లోబో!
మరి శ్వేతకు వచ్చింది సినిమా ఛాన్సా.. ఒకవేళ మూవీలో నటించే అవకాశమైతే దాన్ని ఎవరు ఆఫర్ చేశారు.. తర్వాత ఎందుకు మళ్లీ వెనక్కు తీసుకున్నారు.. ఇంతకీ ఆమె సమస్యకు పరిష్కారం దొరికిందా.. లేదా అని నెటిజనులు తెగ చర్చించుకుంటున్నారు. దీనిపై శ్వేతా వర్మనే క్లారిటీ ఇవ్వాలి. ఇదిలా ఉంటే శ్వేత.. పచ్చీస్, రోజ్‌విల్లా, ఏకమ్, నెగటివ్ సినిమాల్లో నటించింది. శ్వేతా వర్మ చేసిన పోస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇది కూడా చదవండి: బిగ్ బాస్-5 కంటెస్టెంట్ 18.. శ్వేతా వర్మ లైఫ్ స్టోరీ