షణ్ముఖ్‌ నోటి దురద.. శ్వేత సీరియస్‌.. మధ్యలో లోబో!

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌లో వినోదం చూశాం, రొమాన్స్‌ చూశాం, టాస్కులు చూశాం, కొట్లాటలు చూశాం. తెలుగు బుల్లితెర ప్రేక్షకులు బాగా ఎంజాయ్‌ చేస్తున్న రియాలిటీ షో బిగ్‌ బాస్‌. ఈసారి హౌస్‌లోకి వచ్చిన వారిలో బాగా తెలిసిన పేర్లు షణ్ముక్‌, యాంకర్‌ రవి. షణ్ముఖ్‌ మొదటి వారంలో పెద్దగా పార్టిసిపేట్‌ చేసింది.. ఎంటర్‌టైన్‌ చేసింది ఏమీ లేదు. కింగ్‌ నాగార్జున కూడా అరె ఏంట్రా ఇది కాస్త ఆడరా అంటూ ట్రోల్‌ చేసిన విషయం తెలిసిందే. తర్వాత కాస్తో కూస్తో ఆడుతున్నా 7 ఆర్ట్స్‌ సరయు సిరిని తర్వాత లేపుదువూ అంటూ పెద్ద ఆరోపణలే చేసింది. అక్కడి నుంచి షణ్ణు ఆటలో కాస్త తేడా కనిపిస్తోంది. బాగానే మింగిల్‌ అవుతున్నాడు. కెమెరా కంటికి కనిపిస్తున్నాడు. తాజాగా విడుదలైన ప్రోమోలో షణ్ముఖ్‌ శ్వేత దగ్గర బుక్‌ అయిపోయాడు. సరదాగా మొదలైన ఓ స్కిట్‌ ఒక్క చిన్న మాటతో రివర్స్‌ అయిపోయింది.

swetha shannu In Bigg Boss - Suman TVశ్వేతకు పెళ్లి ప్రతిపాదన

‘లోబోని సైడ్‌ చేసి చెక్కు మనం 50-50 చేసుకుందాం. మనం పెళ్లి చేసుకుందాం’ అంటూ షణ్ముఖ్‌ గురువు గారు శ్వేతకు బంపర్ ఆఫర్‌ ఇస్తారు. కాసేపటికే శ్వేత లోబో ఆఫర్‌ను కూడా యాక్సెప్ట్‌ చేస్తుంది. అది గమనించిన గురువు షణ్ముఖ్‌ సీరియర్‌ అవుతాడు. ‘నువ్వాగు ఆమెకు కోపం వచ్చిందంటే మళ్లీ పెయింట్‌ కొట్టేస్తది’ అని షణ్ముఖ్‌ అంటాడు. అంతే ఫన్నీగా మొదలైన షణ్ముఖ్‌, శ్వేత, లోబో స్కిట్‌ అక్కడితో సీరియస్‌, సెంటిమెంట్‌ టర్న్‌ తీసుకుంది. షణ్ణు ఎంత కన్విన్స్‌ చేయాలని చూసినా శ్వేత అయ్యేలా కనిపించలేదు. లోబోకి ఏం చేయాలో తెలీక అలా ఉండిపోతాడు. నా నోటి దురద అంటూ షణ్ముఖ్‌ బాగా ఫీల్ అవుతాడు. ఇలాగే నా గురించి ఆలోచిస్తున్నారా అందరూ? అంటూ శ్వేత ఫీలైపోతుంది. మరి, షణ్ముఖ్‌ శ్వేతను కూల్‌ చేశాడో లేదో తెలియాలంటే ఎపిసోడ్‌ వచ్చేదాకా ఆగాల్సిందే.

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ చూస్తుండండి.