‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో ‘లవ్‌ ట్రాక్‌’ మొదలైంది..?

బిగ్గెస్ట్‌ రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’లో ఆట వేడెక్కింది. కంటెస్టెంట్ల సవాళ్లు, ప్రతిసవాళ్లతో హౌస్‌ మొత్తం హాట్‌హాట్‌గా మారిపోయింది. రెండో రోజుకే హౌస్‌లో అందరూ గ్రూపులు కట్టడం స్టార్ట్‌ చేశారు. ఒకరిపై ఒకరు నువ్వెంతంటే నువ్వెంత అన్నట్లు మాటల యుద్ధానికి తెర లేపారు. గత సీజన్‌లో మూడు, నాలుగు వారాలకు మొదలైన ఇన్‌టెన్‌సిటీ బిగ్‌ బాస్‌ 5 తెలుగులో ఇప్పుడే మొదలైంది. నవ్వులు, కోపాలు, డాన్సులు అసలు మాములుగా లేదు హౌస్‌లో. ఈసారి పవర్‌ రూమ్‌ అంటూ కొత్తగా తీసుకొచ్చిన కాన్సెప్ట్‌ ప్రేక్షకులకు తెగ నచ్చేస్తోంది. విశ్వ ద్వారా యాంకర్‌ రవి, నటి ప్రియకు ఇచ్చిన టాస్క్‌, మానస్‌.. ఆర్జే కాజల్‌కు ఇచ్చిన టాస్క్‌ కూడా చాలా ఇంట్రెస్టింగ్‌గా ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇదిలా ఉండగా తాజా ప్రోమోలో సింగర్‌ శ్రీరామ చంద్ర, హమీదా ముచ్చట్లు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

hamida srirama chandraబెడ్‌ రూమ్‌ క్లీన్‌ చేస్తున్నప్పుడు ఆర్జీ కాజల్‌ శ్రీరామ చంద్రను ఓ ప్రశ్న అడుగుతుంది. నీకు ఎలాంటి అమ్మాయి అంటే ఇష్టమని? అందుకూ శ్రీరామచంద్ర నాకు బబ్లీగా, క్యూట్‌గా టైమ్‌ స్పెండ్‌ చేయడం ఇష్టమని చెప్తాడు. కట్‌ చేస్తే శ్రీరామ చంద్ర, హమీదాతో కలిసి లాన్‌లో బెంచ్‌పై కనిపిస్తాడు. హమీదా ఎందుకో నిరుత్సాహంగా కనిపిస్తుంది. శ్రీరామ వెళ్లి తనతో మాట్లాడుతూ ఆమె మనసులో ఉన్న బాధను తగ్గించేందుకు కొన్ని సూత్రాలు చెప్తాడు. ‘బయట మిత్రులతో అన్నీ ఫ్రీగా షేర్‌ చేసుకునే నీకు ఇక్కడ ఎవరితో చెప్పాలో అర్థం కావడం లేదా? అని శ్రీరామ చంద్ర అడిగాడు. ‘ఇక్కడ ఎవరితో చెప్పాలో తెలీక కన్‌ఫ్యూస్‌ అవుతున్నావు. నీ లోపల స్పేస్‌ని అప్పుడు 10 జీబీ ఉంటే ఇప్పుడు అది 100 జీబీ చేసుకో అని శ్రీరామ చంద్ర సూచిస్తాడు. ఈ మొత్తం ప్రోమోకి బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఆర్‌ఆర్‌ హైలెట్‌. ప్రేక్షకులు అందరూ బిగ్‌ బాస్‌ లవ్‌ ట్రాక్‌ షురూ చేసేశాడు అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి, ఈసారి బిగ్‌బాస్‌ హౌస్‌లో కొత్త జంట తయారైందా? అనే ప్రశ్న బాగా వినిపిస్తోంది. మరి, ఆ ప్రోమో మీరు కూడా చూసేయండి.

ఈ వారం నామినేషన్‌లో యాంకర్‌ రవి, ఆర్జే కాజల్‌, మోడల్‌ జశ్వంత్‌, హమీదా, మానస్‌, సరయు ఉన్న విషయం తెలిసిందే.