‘బిగ్‌ బాస్‌ హౌస్‌’లో లోబో వెట్టి చాకిరి!

lobo shannu

బిగ్గెస్ట్‌ రియాలిటీ షో బిగ్‌ బాస్‌ తెలుగులో దూసుకెళ్తోంది. ఈసారి ఎంటర్‌టైన్మెంట్‌ 5 రెట్లు ఎక్కువగానే కనిపిస్తోంది. హౌస్‌లో రెండురోజుల్లోనే గ్రూపులు, యుద్ధాలు మొదలైపోయాయి. ఒకరిపై ఒకరు ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి, గేమ్‌లో విజయం సాధించడానికి ఎవరి ప్రణాళికలను వారు కట్టుదిట్టంగా అమలు చేస్తున్నారు. ఈక్రమంలో హౌస్‌లో వాతావరణం చాలా గరంగరంగా మారింది. ఎప్పుడూ ఎవరో ఒకరు గొడవ పడటం, కన్నీళ్లు పెట్టుకోవడం అయితే కామన్‌గా కనిపిస్తోంది. నువ్వెంతంటే నువ్వెంతని సవాళ్లు కూడా వినిపిస్తున్నాయి. యానీ మాస్టర్‌, జశ్వంత్‌ మధ్య మాటల యుద్ధం చాలా దూరం వెళ్లింది. నీ వాయిస్‌ రైజ్‌ చేస్తే నా నోరు పెరగదా అంటూ యానీ మాస్టర్‌ చాలా సీరియస్‌ అయ్యింది.

అసలు కథ అంతా ఈసారి ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన పవర్‌ రూమ్‌తోనే ప్రారంభమైంది. పవర్‌ రూమ్‌ యాక్సెస్‌ పొంది ఇప్పటికే విశ్వ, మానస్‌ టాస్క్‌లు ఇచ్చేశారు. విశ్వ రవి, నటి ప్రియకు పనిష్మెంట్‌ ఇచ్చారు. మానస్‌ అయితే ఆర్జీ కాజల్‌కు చాలా కష్టమైన టాస్కే ఇచ్చారు. ఇంటి సభ్యులు అందరూ నిద్రపోయాకే పడుకోవాలంటూ గట్టి టాస్క్‌ ఇచ్చారు. ఆర్జీ కాజల్‌ టాస్క్‌తో చాలా ఇబ్బంది పడుతోంది. కాజల్‌ని ఓడించేందుకు ప్రత్యేకంగా గ్రూపుగా ఏర్పడి నిద్రపోకూడదని నిర్ణయించుకున్నారు.

hamidaమూడోసారి పవర్‌ రూమ్‌లోకి యూట్యూబర్‌ సిరి హన్మంతు వెళ్లింది. తనకు ఇద్దరికి ఎంపిక చేసుకుని వారిలో ఒకరు సేవకుడిగా ఉండేలా ఆదేశించాలని సూచించారు. సిరి లోబో, షణ్ముఖ్‌లను సెలక్ట్‌ చేసింది. లోబో షణ్మఖ్‌కు సేవలు చేయడం, ఒళ్లు పట్టడం చేస్తున్నాడు. ఇంకా ఏమైనా ఉంటే చెప్పండి చేస్తానంటూ సేవకుడిలా మారిపోయాడు. ‘అరె ఏంట్రా ఇది?’ అనే షణ్ముఖ్‌ ఫేమస్‌ డైలాగ్‌ను ఈసారి లోబో చెప్పడం హైలెట్‌గా మారింది. తాజా ప్రోమోలో లహరి, హమీదా ఇద్దరూ గిల్లిగజ్జాలు ఆడుకుంటూ కనిపించారు. ఎలా మాట్లాడాలో హమీదాకు చెప్పే ప్రయత్నం చేస్తుంది లహరి. నువ్వు నాకు నేర్పించాల్సిన అవసరం లేదంటూ హమీదా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇవ్వడం కాస్త ఇంట్రస్టింగా మారింది. లహరి ఇప్పటివరకు ఆర్జే కాజల్‌తో గొడవకు దిగింది. ఇక హమీదా, లహరి గేమ్‌ స్టార్ట్‌ అయ్యేలా కనిపిస్తోంది. ఇక, కన్నీటిపర్యంతం ఎపిసోడ్‌లోకి హమీదా కూడా చేరిపోయింది. హౌస్‌లో జశ్వంత్‌తో మొదలై విశ్వ, కాజల్‌, యానీ మాస్టర్‌, తాజాగా ఈ వర్గంలోకి హమీదా కూడా చేరిపోయింది. ఆ ప్రోమోని మీరు కూడా చూసేయండి.