బండ్ల గణేశ్.. క్యారెక్టర్ ఆర్టిస్టుగా కెరీర్ మొదలు పెట్టి ఒక బడా నిర్మాతగా మారాడు. ఇటీవలే డేగల బాబ్జీ పేరుతో సినిమా తీసి హీరో కూడా అయిపోయాడు. బండ్ల గణేశ్‌కు పూరీ జగన్నాథ్ కుటుంబం అంటే ఎంతో అభిమానం అందరికీ తెలిసిందే. తాజాగా మరోసారి బండ్లన్న తన అభిమానాన్ని చాటుకున్నాడు. జులై 25న ఆకాశ్ పూరీ పుట్టినరోజు. ఈ సందర్భంగా బండ్ల గణేశ్ ఆకాశ్ కు ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశాడు. యంగ్ హీరో ఆకాశ్ పూరీకి జన్మదిన శుభాకాంక్షలు అంటూ క్యాప్షన్ జోడించాడు. ఆ ట్వీట్లో బండ్లన్న పూరీ జగన్నాథ్ ఫ్యామిలీ ఫొటోని షేర్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. Wishing the Young Hero @ActorAkashPuri a very happy birthday #HBDAkashPuri pic.twitter.com/qnxbHpCaus — BANDLA GANESH. (@ganeshbandla) July 25, 2022 పూరీ జగన్నాథ్ సెకెండ్ ఇన్నింగ్స్ లో చాలా బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం విజయ్ దేవరకొండతో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా తెరకెక్కించాడు. ఆ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. ఆ మూవీ ప్రమోషన్స్ లో పూజీ జగన్నాథ్ బిజీగా ఉన్నాడు. ఇటీవలి కాలంలో పూరీ తన కుటుంబాన్ని కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు. బండ్ల గణేశ్ పూరీ ఫ్యామిలీ పిక్ పెట్టగానే అది కాస్తా వైరల్ గా మారింది. ఇటీవలే ఆకాశ్ పూరీ మూవీ చోర్ బజార్ ఈవెంట్ సందర్భంగా బండ్ల గణేశ్ పూరీ జగన్నాథ్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఎందరినో స్టార్స్ ని చేశావ్.. కొడుకుని పట్టించుకోవా అంటూ ప్రశ్నించాడు. ఆ సందర్భంగానే ఆకాశ్‌ని, పూరీ జగన్నాథ్ భార్యను బండ్ల గణేశ్ ప్రసంశించాడు. మరోసారి బండ్ల గణేశ్ తన అభిమానాన్ని చాటుకున్నాడంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి.. ఆకాశ్ పూరీకి కామెంట్స్ రూపంలో మీ శుభాకాంక్షలు తెలియజేయండి. ఇదీ చదవండి: ఓటీటీలో సినిమాల విడుదలకు తెలుగు ఫిలిం ఛాంబర్ కొత్త రూల్! ఇదీ చదవండి: చంపుతానంటూ బాలీవుడ్ కపుల్స్ కి బెదిరింపులు.. కేసు నమోదు!