‘పుష్ప’లో సాంగ్‌ కోసం బాలీవుడ్‌ భామ షాకింగ్‌ రెమ్యునరేషన్‌ డిమాండ్‌! అవాక్కైన నిర్మాతలు

puspha

సుకుమార్‌, అల్లు అర్జున్‌ క్రేజీ కాంబోలో వస్తున్న బిగ్గెస్ట్‌ ప్రాజెక్టు ‘పుష్ప’. పుష్ప రెండు పార్టులుగా వస్తున్న విషయం తెలిసిందే. ఎర్రచందనం స్మగ్లింగ్‌ నేపథ్యంలో సాగే కథ. అల్లు అర్జున్ సరసన రష్మీక మందాన నిటిస్తున్న విషయం తెలిసిందే. చిత్రబృందం ఇటీవల విడుదల చేసిన ఆమె లుక్స్‌ బాగా వైరల్‌ అయ్యాయి. ఈ సినిమా నుంచి రిలీజైన దాక్కో దాక్కో మేక పాట కూడా యూట్యూబ్‌ని షేక్‌ చేసింది. అయితే అభిమానుల కోసం సినిమాలో భారీ అంచనాలతో ఒక ఐటం సాంగ్‌ ప్లాన్‌ చేసినట్లు తెలుస్తోంది. అందుకోసం బాలీవుడ్‌ భామను సంప్రదించారని సమాచారం.

ఇదీ చదవండి: ప్రియాంక సింగ్‌ కు జీవితంలో మర్చిపోలేని సర్‌ ప్రైజ్‌.. కన్నీళ్లు పెట్టిస్తున్న పింకీ

pusphaప్రత్యేక గీతం కోసం సుక్కు బీ టౌన్‌ భామ నోరా ఫేతేహిని సంప్రదించినట్లు సమాచారం. అయితే నటించేందుకు ఒప్పుకొన్న నోరా రెమ్యూనరేషన్‌ డిమాండ్‌ చూసి నోరెళ్లలబెట్టడం వీళ్ల పనైంది. ఐదు నిమిషాల పాట కోసం దాదాపు రెండు కోట్ల రూపాయలు డిమాండ్‌ చేసినట్లు తెలుస్తోంది. నోరా ఫేతేహి అడిగిన రెమ్యూనరేషన్‌ విని అవ్వాక్వడం సుకుమార్‌ వంతైందంట. నోరా పేతేహికి బీటౌన్‌లో మంచి డిమాండ్‌ ఉంది. ఆమె చేసిన చాలా పాటలు సూపర్‌ డూపర్‌ హిట్‌ అయ్యాయి. టెంపర్‌ సినిమాలో సాంగ్‌ కోసం రూ.5 లక్షలు తీసుకున్న నోరా ఏకంగా రూ.2 కోట్లు అడగడం నిజమైతే.. విన్న ప్రతిఒక్కరు అవాక్‌ అవుతారులెండి. మరి, ఆమె డిమాండ్‌కు మేకర్స్‌ ఎలా రియాక్ట్‌ అయ్యారు అన్నది అధికారికంగా ప్రకటన వస్తే గానీ తెలీదు. పాన్‌ ఇండియా మూవీగా వస్తున్న ఈ సినిమాని క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ఇప్పటికే యూనిట్‌ ప్రకటించింది.