జూనియర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఒక్క ఇండియాలోనే కాదు హాలీవుడ్, ప్రపంచవ్యాప్తంగా తారక్ అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఇండియాలోనే ఒక లీడింగ్ హీరోగా ఎదుగుతున్నాడు. అటు వ్యక్తిత్వంలోనూ జూనియర్ ఎన్టీఆర్ కు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. అయితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇంత స్టార్ గా ఎదగడానికి హరికృష్ణ పాత్ర ఎంతో ఉందని చాలా తక్కువ మందికి తెలుసు. తాత నందమూరి తారక రామారావు మేకప్ వేసి.. దగ్గరుండి బాలనటుడిగా తారక్‌ను వెండితెరకు పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఆ తర్వాత అప్పటి నుంచి ఇప్పటివరకు తారక్ వెనక్కి తిరిగి చూసుకున్నది లేదు. అయితే తారక్ ఈ స్థాయికి రావడానికి ఒక తండ్రిగా హరికృష్ణ కూడా ఎంతో కృషి చేశారని అశ్వినీ దత్ మాటలతో వెలుగులోకి వచ్చింది. తారక్ కోసం హరికృష్ణ స్వయంగా ఫోన్ చేసి ఇలా చెప్పారంటూ కొని నిజాలను బయటపెట్టారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అశ్వినీ దత్ స్టూడెంట్ నంబర్ వన్ సినిమా సంగతులను పంచుకోగా ప్రేక్షకులకు పలు ఆసక్తికర విషయాలు తెలిశాయి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తారక్ కెరీర్‌ని ఎంత మలుపు తిప్పిందో అందరికీ తెలిసిందే. అయితే ఆ సినిమా అసలు ముందు తారక్‌తో అనుకోలేదంట. ఆ సినిమా కోసం ప్రభాస్ ను హీరోగా అనుకోగా ఆ తర్వాత హరికృష్ణ ఎంట్రీ ఇచ్చి కథను మార్చేశారు. వైజయంతి మూవీస్ బ్యానర్లో వచ్చిన స్టూడెంట్ నెంబర్ 1 సినిమా కోసం.. హీరోగా ఎవరిని పెట్టాలా అని వెతుకుతున్న సమయంలో మొదట ప్రభాస్ ని అనుకున్నారంట. అయితే ఆ సమయంలో హరికృష్ణ స్వయంగా అశ్వినీ దత్‌కు ఫోన్ చేసి ఆ సినిమాలో తారక్ ను హీరోగా పెట్టాలని కోరారంట. హరికృష్ణ అడగడంతో అశ్వినీ దత్ సైతం జూనియర్ ఎన్టీఆర్‌ని హీరోగా పెట్టి సినిమా తీశారు. ఆ తర్వాత అది ఎంత పెద్ద హిట్ అయ్యింది, తారక్ కు ఎంత పేరు వచ్చిందో అందరూ చూశారు. తారక్ ‘నిన్ను చూడాలని’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా కూడా కెరీర్ మాత్రం స్టూడెంట్ నంబర్ 1 సినిమాతోనే మొదలైంది. మరి.. హరికృష్ణ చక్రం తిప్పబట్టే అలాంటి కథ తారక్‌కు వచ్చింది. అయితే ఆ ఒక్క కథ, ఒక్క సినిమానే కాదు తారక్ కెరీర్లో సినిమాల పరంగా హరికృష్ణ వెన్నంటి నడిపించారని దగ్గరి వారికి బాగా తెలుసు. కానీ, ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సాధించిన నటుడిగా తారక్ ఎదిగిన సమయంలో.. కొడుకు సక్సెస్ ను చూసేందుకు మాత్రం హరికృష్ణ లేకపోవడం నిజంగా చాలా బాధాకరం. తారక్- హరికృష్ణ బాండింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇదీ చదవండి: సింగర్ గీతా మాధురి కుమార్తె పుట్టిన రోజు వేడుకలు.. ఫొటోలు వైరల్! ఇదీ చదవండి: మెగా ఫ్యామిలీ కోడలు కాబోతున్న యాంకర్ మేఘన బ్యాగ్రౌండ్ మాములుగా లేదుగా!