యాంకర్ మేఘన.. నిన్నటివరకు అతి కొద్దిమందికి మాత్రమే తెలుసు. కానీ ఎప్పుడైతే మెగా ఇంటికి కోడలు కాబోతుందని తెలిసిందో.. ఒక్కసారిగా ఆమె పేరు ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. కొణిదెల పవన్ తేజ్‌ను వివాహం చేసుకోబోతుంది మేఘన. గురువారం వీరి నిశ్చితర్థం జరిగింది. ఈ వేడుకకు చిరంజీవి భార్య సురేఖ హాజరయ్యి.. కాబోయే దంపతులను ఆశీర్వదించారు. వీరి నిశ్చితార్థం ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో ప్రస్తుతం అందరి దృష్టి యాంకర్ మేఘన మీద పడింది. అసలు ఈమె ఎవరు.. కుటుంబ నేపథ్యం ఏంటి.. పవన్ తేజ్‌తో ఈమెకు పరిచయం ఎలా ఏర్పడింది వంటి వివరాలు తెలుసుకునేందుకు నెటిజనులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఆ వివరాలు.. యాంకర్ మేఘన స్వస్థలం కాకినాడ అన్నట్లు తెలుస్తోంది. ఆమె తండ్రి పోలీసు డిపార్ట్‌మెంట్‌లో ఉన్నత స్థానంలో ఉన్నట్లు సమాచారం. మేఘన హైదరాబాద్‌లో జన్మించింది. బాల్యం కాకినాడలో గడిచింది. ఆ తర్వాత హైదరాబాద్‌లో డిగ్రీ పూర్తి చేసింది. ఇక కాలేజీలో చదువుకునే రోజుల్లోనే.. ఈవెంట్స్‌కి యాంకరింగ్ చేసేది. సినిమాల్లోకి రావాలనే ఆసక్తితో ఆ దిశగా ప్రయత్నాలు చేసింది. ఇక మేఘన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ చాలా స్ట్రాంగ్ అని.. ఆమె తల్లిదండ్రులకు ఒక్కతే సంతానం అని తెలుస్తోంది. కాకినాడలో వారికి భారీగా ఆస్తులున్నట్లు సమాచారం. మేఘన తొలిసారి హెచ్‌బీడీ హ్యాక్డ్ బై డెవిల్ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. కానీ ఈ చిత్రం డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత 2021లో మెగా హీరో పవన్ తేజ్‌కు జోడిగా ఈ కథలో పాత్రలు కల్పితం సినిమాలో నటించింది. అప్పుడు ఏర్పడిన పరిచయం కాస్త ప్రేమగా మారి.. పెళ్లి పీటల వరకు వచ్చింది. ఇక కొణిదెల పవన్ తేజ్‌కు.. మెగాస్టార్ చిరంజీవి బాబాయ్ అవుతాడు. ‘ఈ కథలో పాత్రలు కల్పితం’ సినిమాతో పవన్ తేజ్ హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఇందులో హీరోయిన్‌గా యాంకర్ మేఘన నటించింది. ఈ సినిమా చిత్రీకరణ సమయంలోనే వీరిద్దరూ లవ్‌లో పడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇద్దరు ఒకరికొకరు నచ్చడంతో.. వారి ప్రేమకు పెద్దలు అంగీకరించారు. గురువారం నిశ్చితార్థం జరగ్గా.. త్వరలో పెళ్లిపీటలెక్కబోతున్నారు. పవన్ తేజ్ ప్రస్తుతం నటుడిగా రాణించేందుకు ప్రయత్నిస్తుండగా.. మేఘన బుల్లితెర మీద పలు షోలకు యాంకర్‌గా అలరిస్తోంది. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి. View this post on Instagram A post shared by Megganna (@m_y_megganna) ఇది కూడా చదవండి: మెగా ఫ్యామిలీ హీరోతో యాంకర్ మేఘన ఎంగేజ్మెంట్.. ఫోటోలు వైరల్! ఇది కూడా చదవండి: వీడియో: స్టేజిపై కంటతడి పెట్టుకున్న హైపర్ ఆది.. కారణం?