తెలుగు సినిమాలకు నంది అవార్డుల రూపంలో ప్రభుత్వం అవార్డులు ఇచ్చేది. అప్పట్లో ఈ అవార్డులను చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేవారు. ఆ అవార్డులు వచ్చినప్పుడు నటీనటులు కూడా గౌరవంగా భావించేవారు. కానీ ఆంధ్రప్రదేశ్ విడిపోయి.. రెండు తెలుగు రాష్ట్రాలుగా ఏర్పడ్డాక అవార్డులు ఇచ్చిన దాఖలాలు లేవు. దీనిపై ప్రముఖ నిర్మాతు స్పందించారు.
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన సీతారామం సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది. సినిమా విడుదలై వారం రోజులు కావొస్తున్న ఇంకా వసూళ్ల పరంపర కొనసాగుతోంది. యుద్ధం నేపథ్యంలో తెరకెక్కిన ప్రేమ కథని ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా తెరకెక్కించడంలో దర్శకుడు హను రాఘవపూడి సక్సెస్ అయ్యారు. స్టోరీ బాగుంటే.. సినిమాలు సక్సెస్ అవుతాయని మరో సారి ప్రేక్షకులు రుజువు చేశారు. సినిమా భారీ విజయం సాధించిన నేపథ్యంలో చిత్రం […]
నిర్మాత అశ్వనీదత్ వ్యవహారం చూస్తే.. ఎన్నికల్లో బరిలో నిలిచే ఆలోచన ఉందా.. అందుకే ఏపీ ప్రభుత్వం, సీఎం జగన్ మీద ఇంత ధాటిగా విమర్శలు చేస్తున్నారా.. అనే అనుమానాలు తలెత్తకమానవు. చంద్రబాబుకు మద్దతుగా మాట్లాడుతుండటంతో.. టీడీపీ నుంచే బరిలో దిగి అవకాశాలే అధికంగా ఉన్నాయి అంటున్నారు. ఇక గతంలోనే ఆయన 2004లో విజయవాడ పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా అప్పటి కాంగ్రెస్ నేత లగడపాటి రాజగోపాల్‌పై పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉన్నారు. […]
తెలుగు సినిమా చరిత్రలో నిర్మాతగా అశ్వినీదత్‌కి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందించారు. అయితే ఆయన కెరీర్‌లో కొన్ని యావరేజ్‌లు, ఫ్లాపులు కూడా ఆయన్ని పలకరించాయి. కానీ శక్తి పలకరించినంత క్లోజ్‌గా మరే మూవీ ఆయన్ని పలకరించలేదట. ఏకంగా ఊరొదిలిపెట్టి పోవాల్సిన పరిస్థితి వచ్చిందట. శక్తి సినిమా దెబ్బకి అశ్వినీదత్ ఏడేళ్ళు ఇండస్ట్రీకి దూరమయ్యారు. టిఎఫ్‌పిసికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ […]
ఏపీ సీఎం జగన్ సర్కార్, చిన జీయర్ స్వామిలపై సినీ నిర్మాత అశ్వినీ దత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడేళ్ల జగన్ పాలనలో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయని.. ప్రస్తుతం తిరుమలలో జరగని పాపమంటూ లేదని అశ్వినీదత్ మండిపడ్డారు. తిరుపతి పరపతి దిగజారిందని.. ఇన్ని జరుగుతున్నా ఆ స్వామి ఎందుకు చూస్తూ కూర్చున్నాడో తెలియడం లేదన్నారు. అక్కడ జరిగే అన్యాయాలను ఊహించలేమని.. ప్రభుత్వం తిరుపతిని సర్వనాశనం చేసిందన్నారు. సీతారామం సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ […]