సౌత్‌లో మొదటి హీరో! అరుదైన ఘనత సాధించిన అల్లు అర్జున్‌

పుష్పా సక్సెస్‌తో మంచి జోష్‌ మీదున్న ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ మరో అరుదైన ఘనత సాధించారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదలైన బన్నీ చిత్రం కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇక బాలీవుడ్‌లో ఇప్పటికే ఏకంగా 80 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి వంద కోట్ల వైపు దూసుకెళుతోంది. సినిమాల సంగతి పక్కన పెడితే అల్లు అర్జున్‌ సోషల్‌ మీడియాలో కూడా చాలా యూక్టివ్‌గా ఉంటారు.

దీంతో ఆయనను ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా బాగానే ఉంది. ఈక్రమంలో సోషల్‌ మీడియాలో అరుదైన రికార్డు సొంతం చేసుకున్నాడు బన్నీ. సంక్రాంతి నాటికి బన్నీ ఇన్ స్టాలో 15 మిలియన్ల ఫాలోవర్లు చేరారు. దక్షిణాది సినీ పరిశ్రమలో ఈ రికార్డు అందుకున్న తొలి హీరో బన్నీనే కావడం విశేషం. కాగా తనకు 15 మిలియన్ ఫాలోయర్స్ రావడంపై అల్లు అర్జున్ సంతోషంగా ఫీలయ్యాడు . తనపై అమితమైన ప్రేమాభిమానాలు కురిపిస్తున్న ఫ్యాన్స్ కు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలిపారు.

అలాగే ఇన్‌స్టాగ్రామ్‌తో పాటు ట్విట్టర్‌ లోనూ బన్నీ ఫాలోయింగ్‌ మాములుగా లేదు. అక్కడ 6 మిలియన్ల మంది అతనిని అనుసరిస్తున్నారు. అలాగే ఫేస్ బుక్‌లో అయితే ఏకంగా 21 మిలియన్ ఫాలోయర్స్ పైగా ఉన్నారు. కాగా దక్షిణాది హీరోల్లో కేవలం విజయ్ దేవరకొండ మాత్రమే బన్నీకి దగ్గర్లో ఉన్నాడు. ఈ టాలీవుడ్ రౌడీకి ఇన్‌స్టాగ్రామ్‌లో 14.2 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. దీంతో బన్నీ ఫ్యాన్స్‌ ఫుల్‌ హ్యాపీగా ఉన్నారు. మరి బన్నీ ఫాలోయింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Allu Arjun (@alluarjunonline)