‘పూనప్ కౌర్’ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలు.. తాజాగా నాతిచరామి సినిమాతో మరోసారి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ సినిమాతో మళ్లీ టాలీవుడ్ లో రీ ఎంట్రీ ఇస్తారేమో చూడాలి. పూనమ్ కౌర్ ను సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా ఇంటర్వ్యూ చేసింది. ఆ ఇంటర్వ్యూలో తన చిన్ననాటి జ్ఞాపకాలు, తన సినిమాలు, తన వ్యక్తిగత జీవితం ఇలా ఎన్నో విషయాలను పంచుకుంది. అలాగే తెలుగు హీరోలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు కూడా చేసింది.
ఇదీ చదవండి: పవన్ కళ్యాణ్ అంటే కాంట్రవర్సీ! అతని గురించి మాట్లాడను: పూనమ్!
హీరో ఫొటో చూపించి ఒక్క మాట చెప్పండి అనగానే.. మహేశ్ బాబుకు ‘సేవింగ్ హార్ట్స్’, అల్లు అర్జున్ ‘స్నేహా’ ఇలా చెప్తూ వచ్చింది. బాలయ్య బాబును చూడగానే ఒక్కసారి ‘మాన్షన్ హౌస్’ అంటూ నవ్వేసింది. అంతేకాదు బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి కూడా చెప్పుకొచ్చింది. ఆయనలో ఒక చిన్నపిల్లాడు ఉన్నాడని. అందుకే ఇంత వయసు వచ్చినా కూడా ఎంతో ఎనర్జిటిక్ గా నటిస్తున్నారంది. ఇప్పడున్న సీనియర్ హీరోలు అందరికీ ఒక బ్లెస్సింగ్ ఉందని.. అందుకే వాళ్లు అంత సక్సెస్ ఫుల్ గా ముందుకెళ్తున్నారంది.అంతేకాకుండా బాలయ్యతో నటించారా? అనే ప్రశ్నకు ‘ఒక సినిమాలో ఆఫర్ వచ్చింది.. నేను శ్రేదేవీ క్యారెక్టర్ చేస్తానన్నాను. అందుకు వాళ్లు ఒప్పుకోలేదు. నేను ఆ సినిమా చేయలేదు. ఆ తర్వాత మళ్లీ చేసి అడిగారు. నేను అదే క్యారెక్టర్ కావాలని చెప్పాను’ అంటూ పూనమ్ కౌర్ వ్యాఖ్యలు చేసింది. పూనమ్ కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.