Chiranjeevi: వెండి తెర ‘ఇంద్రసేనుడు’ మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు నేడు. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా అన్ని వర్గాలకు చెందిన ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు ఉత్తేజ్ కూడా శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక, ఇండస్ట్రీలో చిరంజీవిని స్పూర్తిగా తీసుకునే వారిలో ఉత్తేజ్ ఒకరు. చిరుకు ఉత్తేజ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. తనకు చిరుతో ఉన్న అనుబంధానికి.. చిరుపై ఉన్న అభిమానానికి గుర్తుగా ఓ మంచి కవితతో ఉత్తేజ్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఆ కవితి ఇదే.. అన్నయ్యా పుట్టినరోజు శుభాకాంక్షలు.... రేడియో లో మెరుపులా... లా...లా ఆడతా... తా. తా. మీ పాట... ఈటీవీ లో... గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాట... మీ డాన్స్.. ఎక్కడ విన్నా, ఎక్కడ చూసినా, ప్రతీ చోటా. మీ పుట్టినరోజు విశేషాలు..సంబరాలు.. కేక్ కట్టింగ్స్....రక్త దానం శిబిరాలు... శ్రీకృష్ణాష్టమి చిరంజీవి పుట్టినరోజు వినాయక చవితి విజయదశమి... ఇలా... మా పండగ మీరు, మా జాతర మీరు, మా సంతోషం మీరు, దేహాన్ని ఆయుధం చేసుకుని దాహాన్ని జీవితం చేసుకుని లక్ష్యాల్ని దాసోహం చేసుకుని... మా " మెగాస్టార్" అయ్యారు మా " అన్నయ్య " అయ్యారు మీరు మా ఆరాధ్యం. ఈ అప్రతిహత ప్రయాణంలో పరోపకారమిదం శరీరమయింది... బాధార్తుల చేయూత మీ జీవితమైంది.... సహాయాలు లక్ష్యాలు కావని మీ మహోత్క్రుష్ట వ్యక్తిత్వం చెప్తోంది... మంచిపనులు మీ సహజగుణమై సాక్షాత్కారమవుతోంది.. మీరు మా ఆదర్శం మిమ్మల్ని చూస్తే బ్రతుకు మీద నమ్మకం వస్తోంది. మేము చేసుకున్న అదృష్టం మీరు ఇది ఒక్కడి మాట కాదు.. ఎందరెందరో బాధార్తుల, అన్నార్తుల గుండె పలికే మాటలివి.. నీ జన్మ ధన్యం తండ్రీ!!! మీరు చల్లగా ఉండాలి.. మీరు సంతోషంగా ఉండాలి.. లవ్ యూ అన్నయ్యా... ఇవి కూడా చదవండి : Chiranjeevi: చిరంజీవి బర్త్ డే సందర్భంగా వైరల్ అవుతున్న అభిమాని ఓపెన్ లెటర్!