ప్రస్తుతం తెలుగు సినీ ప్రేక్షకులు అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ఆచార్య. మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఇప్పటికే చిత్రం బృందం ప్రీరిలీజ్ ఈవెంట్, ప్రమోషన్ కార్యక్రమాలతో సినిమాపై అంచనాలను ఓ రేంజ్‌లో పెంచుతున్నారు. ఇక ఇద్దరు సూపర్‌స్టార్లను ఒకేసారి తెర మీద ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఆత్రంగా ఎదురు చూస్తున్నారు. సినిమా మీద క్రియేట్ అయిన పాజిటివ్ బజ్ చూస్తుంటే.. కలెక్షన్ల సునామీ పక్క అని క్లియర్‌గా అర్థం అవుతుంది.
ఇది కూడా చదవండి: ఆ యాడ్ కు చిరు పారితోషికం ఎన్ని కోట్లో తెలుసా?
ఇక తాజాగా ఆచార్య బృందం మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ నిర్వహించింది. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు దర్శకుడు కొరటాల శివ, చిరంజీవి, రామ్ చరణ్ సమాధానాలు చెప్పారు. ఇక ప్రెస్‌మీట్ అనంతరం ఫోటో సెషన్ కార్యక్రమంలో చిరు చిలిపి చేష్టలతో అందరిని ఆశ్చర్యపరిచారు. పూజా హెగ్డెతో ఫోటోలు దిగే క్రమంలో రామ్ చరణ్‌ను పక్కకు పంపి.. పూజాతో మాత్రమే ఫోటోలు దిగారు. ఆమెతో కలిసి స్టేజీ మీద డ్యాన్స్ వేసే ప్రయత్నం చేశారు. ఒకానొక సందర్భంలో పూజాను హగ చేసుకునేందుకు ప్రయత్నించారు చిరంజీవి. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇక పూజా మాత్రం ఈ వీడియోను చూసి తెగ నవ్వుకున్నారు. ఆయన ఎంతో జోవియల్, స్వీట్ పర్సన్ అని చిరంజీవి మీద ప్రశంసలు కురిపించారు.
ఇది కూడా చదవండి: ‘ఆచార్య’లో రామ్ చరణ్ బదులు పవన్ కళ్యాణ్.. చిరు ఏమన్నాడంటే!
ఇది కూడా చదవండి: అది అమ్మ కోరిక.. అందుకే ఆ సినిమా చేశా: రామ్ చరణ్
ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. భోళా శంకర్, లూసిఫర్ రీమేక్ గాడ్‌ఫాదర్ చిత్రంతో పాటు మరో రెండు సినిమాలు చేస్తూ.. బిజీగా ఉన్నారు. చిరు స్పీడ్ చూసిన నెటిజనులు.. వయసు అనేది కేవలం నంబర్ మాత్రమే.. ఆయనలో స్పీడ్, జోష్ ఏ మాత్రం తగ్గలేదని అర్థం అవుతోంది అని కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
😂 Sweetest and ever Jovial @KChiruTweets Garu 🤗🤗🤗 #Aacharya https://t.co/x2jKyntU8A
— Pooja Hegde (@hegdepooja) April 26, 2022