ఐపీఎల్ 2022 సీజన్ దాదాపు ముగిసింది. ఛాంపియన్లు టేబుల్ లీస్ట్ పొజిషన్స్ తో సరిపెట్టుకుంటే.. కొత్తగా వచ్చిన గుజరాత్, లక్నో జట్లు ప్లే ఆఫ్స్ కు చేరాయి. 2018 తర్వాత రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలిసారి ప్లే ఆఫ్స్ కు చేరుకుని టైటిల్ కన్నేసింది. ఇంక ముంబై, చెన్నై పరిస్థితి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెండు జట్లు ఈ సీజన్లో అత్యంత చెత్త రికార్డులను తమ పేరిట నమోదు చేశాయి. ముంబై అయితే ఈ సీజన్లో టేబుల్ లీస్ట్ పొజిషన్ తో సరిపెట్టుకుంది. ముంబై ఇండియన్స్ ప్రదర్శన గురించి పక్కన పెడితే ఆ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ పై మాత్రం సచిన్ టెండూల్కర్ అభిమానులు తీవ్ర ఆగ్రం వ్యక్తం చేస్తున్నారు. రోహిత్ శర్మ– సచిన్ టెండూల్కర్ కు నమ్మక ద్రోహం చేశాడంటూ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.
ఐపీఎల్ 2022 సీజన్లో ఒక్క మ్యాచ్ లోనూ అర్జున్ టెండూల్కర్ కు అవకాశం కల్పించకపోవడమే అందుకు కారణం. ఈ సీజన్ మొత్తంలో ముంబై ఇండియన్స్ కొత్త కుర్రాళ్లకు అవకాశం ఇవ్వలేదా అంటే.. తిలక్ వర్మ, హృతిక్ షోకీన్, రమన్ దీప్ సింగ్, కుమార్ కార్తికేయ, డేవాల్డ్ బ్రేవిస్, ట్రిస్టన్ స్టబ్స్ వంటి కుర్రాళ్లంతా ముంబై తరఫున ఈ సీజన్లో తమకంటూ అవకాశాలు పొందారు. కానీ, అర్జున్ టెండూల్కర్ మాత్రం బెంచ్ కే పరిమితం అయ్యాడు. ముంబై జట్టు ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తరుణంలో అయినా అర్జున్ టెండూల్కర్ కు అవకాశం దక్కుతుందని అంతా ఎదురుచూశారు.
So No Arjun Tendulkar even today !
Still no chance to #ArjunTendulkar.
Two Ipl Seasons But not even a single game 😔😔. #MIvDC#MumbaiIndians pic.twitter.com/7z6OClbPGy— Sachin Tendulkar🇮🇳 FC (@CrickeTendulkar) May 21, 2022
The wait for Arjun Tendulkar continues.
— Bharath Ramaraj (@Fancricket12) May 21, 2022
ఇదీ చదవండి: రాజస్థాన్ రాయల్స్ జట్టు ప్రయాణిస్తున్న విమానంలో పొగలు! భయంతో కేకలు వేసిన ఆటగాళ్లు
ఆఖరికి మే 21న ఢిల్లీతో జరిగిన ఆఖరి మ్యాచ్ లో అయినా అవకాశం ఇస్తారని ఎదురుచూసిన అభిమానులకు నిరాశే ఎదురైంది. అర్జున్ కు అవకాశం దక్కకపోవడంపై సచిన్ అభిమానులు రోహిత్ శర్మ తీరును తప్పుబడుతున్నారు. బెంచ్ మీద కూర్చోబెట్టేందుకు రూ.30 లక్షలు పెట్టి కొనాల్సిన అవసరం ఏముందని ప్రశ్నిస్తున్నారు. ముంబై ఇండియన్స్ జట్టులో అర్జున్ టెండూల్కర్ నాలుగేళ్లు అనధికారిక నెట్ బౌలర్ గా, రెండేళ్లు అధికారిక నెట్ బౌలర్ గా కృషి చేస్తున్న విషయం తెలిసిందే. ముంబై జట్టు అర్జున్ టెండూల్కర్ ను రిలీజ్ చేయాలంటూ సచిన్ అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.
నిజానికి వేలంలో అర్జున్ టెండూల్కర్ ను కొనేందుకు గుజరాత్ టైటాన్స్ యాజమాన్యం ఆసక్తి చూపింది. అతడిని రూ.25 లక్షలకు కొనుగోలు చేసేందుకు కోట్ కూడా చేసింది. కానీ, ముంబై ఇండియన్స్ చివర్లో రూ.30 లక్షలకు అర్జున్ టెండూల్కర్ ని సొంతం చేసుకుంది. అయితే టేబుల్ లీస్ట్ పొజిషన్ వచ్చిన సీజన్లోనే అర్జున్ టెండూల్కర్ కు అవకాశం కల్పించకపోతే.. ఇంక వచ్చే సీజన్లలో అసలు అర్జున్ బెంచ్ మీదైనా ఉంటాడా? అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రోహిత్ శర్మ- సచిన్ టెండూల్కర్ కు నమ్మక ద్రోహం చేశాడా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Arjun Tendulkar from last two years. pic.twitter.com/beezAzXfaW
— Sai Teja (@csaitheja) May 21, 2022
What’s the point of having Arjun Tendulkar in the squad if you’re not going to give him 2 games?
— Kunal Gawli (@gawliist) May 17, 2022
If Ananya Pandey is the right side of nepotism..Then Arjun Tendulkar is the wrong side of nepotism…#MIvsDC #IPL2022 #ArjunTendulkar #MumbaiIndians pic.twitter.com/ahjyPMHjdq
— WE जय (@Omnipresent090) May 21, 2022