రాజస్థాన్ రాయల్స్ జట్టు ఆటగాళ్లకు ఓ చేదు అనుభవం ఎదురైంది. వాళ్లు ప్రయాణిస్తున్న విమానంలోకి ఒక్కసారిగా పొగమంచు చేరిపోవడంతో అంతా భయంతో కేకలు పెట్టారు. మొదట అంతా అది పొగ అనుకుని ఎంతో భయపడ్డారు. కానీ, అది పొగ మంచు అని తెలుసుకుని తర్వాత ఊపిరి పీల్చుకున్నారు. కాసేపటికి ఆ పొగ మంచి క్లియర్ కావడంతో రాజస్థాన్ రాయల్స్ ఆటగాళ్లంతా కుదుటపడ్డారు. ఐపీఎల్ 2022లో భాగంగా గుజరాత్ తో జరగనున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. అప్పటివరకు ఎంతో ఉత్సాహంగా గడిపిన ఆటగాళ్లు ఇలా జరగడంతో గగ్గోలు పెట్టారు.
వాతావరణం సరిగా లేకపోవడమే ఇందుకు కారణంగా చెబుతున్నారు. అయితే అలాంటి పొగమంచు కప్పేసిన సమయంలో విమానానికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆటగాళ్ల పరిస్థితి ఏంటని అంతా ప్రశ్నిస్తున్నారు. కోల్ కతాలో మే 24న గుజరాత్ తో జరగనున్న క్వాలిఫయర్ 1 మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ విమానంలో బయల్దేరిన సమయంలో ఇలా జరిగింది. ఆ తర్వాత సురక్షితంగా విమానం కోల్ కతాలో ల్యాండ్ అయ్యింది. ఆటగాళ్లంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
🛫 Based on a true experience! 😂#RoyalsFamily | #HallaBol pic.twitter.com/p5KSFH09CB
— Rajasthan Royals (@rajasthanroyals) May 22, 2022
No off days for @ashwinravi99’s 🧠… 😂 pic.twitter.com/85OmSCn7p2
— Rajasthan Royals (@rajasthanroyals) May 22, 2022