ఐపీఎల్ 2022 సీజన్ ఆఖరి మజిలీకి చేరుకుంది. మే 29న అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్– రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కోసం తలపడనున్నాయి. సెకండ్ క్వాలిఫయర్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును చిత్తుగా ఓడించిన రాజస్థాన్ ఫైనల్ చేరింది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్ జట్టు.. ఆర్సీబీ బ్యాటర్లను కట్టడి చేయడంలో సక్సెస్ అయ్యింది. 20 ఓవర్లలో కేవలం 157 పరుగులే చేసిన ఆర్సీబీ జట్టు ఓటమి పాలైంది. ఆ జట్టులో ఒక్క రజత్ పటీదార్ మాత్రమే చెప్పుకోదగిన స్కోర్(58) చేశాడు. మిగిలిన వాళ్లంతా తక్కువ స్కోరుకే పెవిలియన్ చేరారు.
రాజస్థాన్ రాయల్స్ ఇన్నింగ్స్ విషయానికి వస్తే.. ఇంకా 11 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. జోస్ బట్లర్ 60 బంతుల్లో 106 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. తమ జట్టు ఫైనల్ చేరడంలో కీలక పాత్ర పోషించాడు. 18వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీసి తన శతకాన్ని పూర్తి చేశాడు. దాంతో 2016 సీజన్లో 4 శతకాలు బాదిన విరాట్ కోహ్లీ రికార్డును సమం చేశాడు. ఆ తర్వాత మాస్ సెలబ్రేషన్స్ చేసుకుని మైదానం మొత్తం పరుగులు తీశాడు.
Maybe Jos butler failed to break record of kohli but he break heart of kohli. Jos the boss you rock. Celebration after century #RCBvRR #Chokli #JosButtler pic.twitter.com/K4XVNmjN1G
— Aditya (@pradeep__3576) May 27, 2022
ఆ విషయంపై మ్యాచ్ తర్వాత రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చేసిన ఇంటర్వ్యూలో ప్రశ్నించగా ఆసక్తికర సమాధానం ఇచ్చాడు. ‘ఆ సెంచరీని ఎంతగానో ఎంజాయ్ చేశాను. కరోనా వల్ల ఇంతకాలం అన్ని మ్యాచ్ లు ఖాళీ మైదానాల్లో జరిగాయి. ఈ మ్యాచ్ లో దాదాపు లక్షమంది ప్రేక్షకుల మధ్య కీలక మ్యాచ్ లో సెంచరీ చేశాక నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక పోయాను. అందుకే అలా సెలబ్రేట్ చేసుకున్నా’ అంటూ జోస్ బట్లర్ సమాధానం చెప్పాడు.
WHAT. A. WIN for @rajasthanroyals! 👏 👏
Clinical performance by @IamSanjuSamson & Co. as they beat #RCB by 7⃣ wickets & march into the #TATAIPL 2022 Final. 👍 👍 #RRvRCB
Scorecard ▶️ https://t.co/orwLrIaXo3 pic.twitter.com/Sca47pbmPX
— IndianPremierLeague (@IPL) May 27, 2022
ఏది ఏమైనా జోస్ బట్లర్ మాత్రం ఆర్సీబీ తరఫున హిట్లర్ అయ్యాడు అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ఈ సీజన్లో ఇప్పటివరకు 4 శతకాలు, 4 అర్ధశతకాలు చేశాడు, 824 పరుగులు చేసి.. ఆరెంజ్ క్యాప్ సొంతం చేసుకున్నాడు. ఫైనల్ లో జోస్ బట్లర్ ఇదే ఫామ్ కొనసాగిస్తే.. రాజస్థాన్ రాయల్స్ టైటిల్ కొట్టడం ఖాయం అయిపోయినట్లే అంటూ అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. జోస్ బట్లర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.