ఐపీఎల్ 2022 ఆరంభానికి కొన్ని గంటల ముందు చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు పెద్ద షాకే తగిలింది. ఎంఎస్ ధోనీ చెన్నై కెప్టెన్ గా తప్పుకుని బాధ్యతలను జడేజాకు అప్పగించాలని సూచించాడు. ఆ విషయంపై చెన్నై సూపర్ కింగ్స్ జట్టు యాజమాన్యం అధికారికంగా ప్రకటించింది. ధోనీకి ఈ ఐపీఎల్ చివరి సీజన్ అనుకుంటున్న నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడని క్రికెట్ అభిమానులు తలలు పట్టుకుంటున్నారు. అయితే ధోనీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా అది జట్టు ప్రయోజనాల కోసమే అంటూ సర్దిచెప్పుకుంటున్నారు. అయితే కెప్టెన్సీ విషయంపై స్వయంగా జడేజానే స్పందించాడు.
ఇదీ చదవండి: ధోనీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై విరాట్ కోహ్లీ ఎమోషనల్ ట్వీట్
కెప్టెన్సీపై జడేజా మాట్లాడుతూ ‘కెప్టెన్ గా అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరోవైపు కాస్త కంగారుగా కూడా ఉంది. కెప్టెన్ గా మహీ భాయ్ గొప్ప బాటను వేశారు. నేను ఆయన లెగసీని కొనసాగించాలి. కానీ, నాకు అంత ఆందోళనగా ఏం లేదు. నాకు ఏ చిన్న సమస్య వచ్చినా గైడ్ చేయడానికి మహీ భాయ్ ఉన్నాడు. ఆయన కెప్టన్ గా మాత్రమే తప్పుకున్నాడు. ఆటగాడిగా జట్టులో కొనసాగుతాడు’ అంటూ జడ్డూ చెప్పుకొచ్చాడు. జడేజా రియాక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
📹 First reactions from the Man himself!#ThalaivanIrukindran 🦁💛 @imjadeja pic.twitter.com/OqPVIN3utS
— Chennai Super Kings (@ChennaiIPL) March 24, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.