Telugu News

OPEN APP
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా
  • OTT మూవీస్
  • రివ్యూలు
  • క్రీడలు
  • క్రైమ్
  • జాతీయం
  • ప్రపంచం
  • వైరల్
trending
  • #భారత్ vs ఇంగ్లాండ్
  • #బుమ్రా కెప్టన్‌ ఇన్నింగ్స్‌
  • #OTT మూవీస్
  • #ఫోటో స్టోరీస్
follow us:
  • Suman TV Fb
  • Suman TV Youtube
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • వార్తలు
    • ప్రపంచం
    • జాతీయం
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • క్రైమ్
    • వైరల్
  • క్రీడలు
    • ఐపీఎల్‌ 2022
  • సినిమా
    • రివ్యూలు
    • ఫోటోలు
    • బిగ్ బాస్ 5
    • బిగ్ బాస్ OTT
  • బిజినెస్
  • జీవన శైలి
    • ఆధ్యాత్మికత
    • ఆరోగ్యం
    • ట్రావెల్
    • ఫ్యాషన్
  • టెక్నాలజీ
  • మిస్టరీ
  • వీడియోలు
  • OTT మూవీస్
  • Telugu News
  • ⁄ipl 2022
  • ⁄Ipl 2022 Csk Batters Played Like Odi Against Gujarat Titans

IPL 2022: ధోని అన్న.. ఇది వన్డే కాదు టీ20! CSK బ్యాటింగ్‌పై పేలుతున్న సెటైర్లు

    Published Date - Mon - 16 May 22
IPL 2022: ధోని అన్న.. ఇది వన్డే కాదు టీ20! CSK బ్యాటింగ్‌పై పేలుతున్న సెటైర్లు

ఐపీఎల్‌ 2022లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ 9వ ఓటమిని నమోదు చేసింది. ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో ఓడింది. కాగా ఈ మ్యాచ్‌లో CSK బ్యాటింగ్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. సోషల్‌ మీడియాలో వేదికగా ఫ్యాన్స్‌ దారుణంగా కామెంట్‌ చేస్తున్నారు. టీ20 లీగ్‌లో వన్డే బ్యాటింగ్‌ చేస్తున్నారంటై విమర్శలు గుప్పిస్తున్నారు. చెన్నై బ్యాటర్లలో ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (53పరుగులు 49 బంతుల్లో 4 ఫోర్లు ఒక సిక్స్), ఎం జగదీషన్ (39 పరుగులు 33 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 133 పరుగులు మాత్రమే చేసింది.

తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నైకి మరోసారి శుభారంభం దక్కలేదు. చెన్నై స్టార్ ఓపెనర్ డెవాన్ కాన్వే 9 బంతులాడి కేవలం 5 పరుగులు చేసి షమీ బౌలింగ్‌లో కీపర్ క్యాచ్‌గా అవుట్ అయ్యాడు. 4 ఓవర్లు ముగిసేసరికి చెన్నై ఒక వికెట్ కోల్పోయి 15 పరుగులు మాత్రమే చేసింది. తొలి నాలుగు ఓవర్లలో చెన్నై ఒక్క బౌండరీ కూడా కొట్టలేదు. 8వ ఓవర్‌ వరకు పర్వాలేకున్నా.. 9వ ఓవర్లో సాయికిషోర్ బౌలింగ్‌లో మొయిన్ అలీ (21పరుగులు 17 బంతుల్లో) క్యాచ్ అవుట్ అయ్యాడు. దీంతో చెన్నై ఇన్నింగ్స్ మళ్లీ చప్పగా మారింది. ఈ క్రమంలో 15వ ఓవర్ వరకు నిలిచిన రుతురాజ్ గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఆ తర్వాత రుతురాజ్ ఎక్కువ సేపు క్రీజులో నిలబడలేకపోయాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో క్యాచ్ అవుట్ అయ్యాడు.

 Dhoni anna .. this is not ODI T20!

ఇక తర్వాత వచ్చిన శివమ్ దూబే డకౌట్‌ కాగా.. చివర్లో ధోనీ 10 బంతులాడి తన జెర్సీ 7తోనే సరిపెట్టాడు. దీంతో 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇన్నింగ్స్‌ తొలి నాలుగు ఓవర్లు ఒక ఫోర్‌ కూడా కొట్టని చెన్నై బ్యాటర్లు చివరి ఐదు ఓవర్లు కూడా అదే చెత్త బ్యాటింగ్‌ చూపించారు. డెత్ ఓవర్లలో 15 నుంచి 20 ఓవర్లలో ఒక్క బౌండరీ కూడా కొట్టలేకపోయారు. చేతిలో వికెట్లు ఉన్నా కూడా ఒక్క ఫోర్ కానీ, సిక్స్ కానీ చెన్నై బ్యాటర్ల నుంచి రాకపోవడం గమనార్హం. డెత్ ఓవర్లలో గుజరాత్ బౌలర్లు రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, యష్ దయాల్, మహ్మద్ షమీ అద్భుతమైన బౌలింగ్‌తో చెన్నై బ్యాటర్లను పూర్తిగా కంట్రోల్ చేశారు. 15 ఓవర్లు ముగిసేసరికి 109 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయిన చెన్నై కనీసం 150 లేదా 160 పరుగుల స్కోరు చేస్తుందని అంతా భావించారు. కానీ సీన్ వేరేలా మారింది.

 Dhoni anna .. this is not ODI T20!

చివరి అయిదు ఓవర్లలో ఆ జట్టు చేసింది కేవలం 24 పరుగులు మాత్రమే.. అంటే డెత్ ఓవర్లలో 30 బంతుల్లో కేవలం 24పరుగులు మాత్రమే చెన్నై బ్యాటర్లు చేయగలిగారు. ఐపీఎల్ లాంటి ప్రతిష్ఠాత్మక టోర్నీలో డెత్‌ ఓవర్లలో అత్యంత చెత్త ప్రదర్శన ఇదే కావొచ్చు. చేతిలో ఇంకా 8 వికెట్లు ఉన్న తరుణంలో ధోనీతో సహా చెన్నై బ్యాటర్లెవరు బ్యాట్ ఝళిపించలేకపోయారు. ఫలితంగా 133పరుగులకే చెన్నై పరిమితమైంది. బ్యాటర్లు విఫలం అయినా చెన్నై బౌలర్లు పర్వాలేదనిపించారు. స్వల్ప లక్ష్యాన్ని కూడా గుజరాత్‌కు అంత ఈజీగా చేజ్‌ చేయనియలేదు. మ్యాచ్‌ను చివరి ఓవర్‌ తొలి బంతి వరకు తీసుకెళ్లారు. 134 పరుగుల లక్ష్యాన్ని గుజారత్‌ 19.1 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌లో చెన్నై బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Matheesha Pathirana: IPL 2022లో గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చిన బేబీ మలింగా

Not our day, but new rays of hope 💛#CSKvGT #WhistlePodu #Yellove 🦁 pic.twitter.com/d5EE3PcdlZ

— Chennai Super Kings (@ChennaiIPL) May 15, 2022

మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.

Tags :

  • CSK
  • CSK vs GT
  • ipl 2022
  • MS dhoni

Related News

MS Dhoni: ధోనికి చికిత్స అందించే ఈ వైద్యుడి ఫీజు రూ.40

MS Dhoni: ధోనికి చికిత్స అందించే ఈ వైద్యుడి ఫీజు రూ.40

  • IND vs ENG Test: రిటైర్‌ అయి 8 ఏళ్లైనా.. ధోనిని మిస్‌ అవుతున్న ఫ్యాన్స్‌

    IND vs ENG Test: రిటైర్‌ అయి 8 ఏళ్లైనా.. ధోనిని మిస్‌ అవుతున్న ఫ్యాన్స్‌

  • MS Dhoni: మారుమూల గ్రామంలో ధోనికి వైద్యం! అసలు ఏమైంది?

    MS Dhoni: మారుమూల గ్రామంలో ధోనికి వైద్యం! అసలు ఏమైంది?

  • Hardik Pandya: కెప్టెన్‌గా ధోనిని గుర్తుకు తెచ్చిన హార్థిక్‌ పాండ్యా! సిరీస్‌ గెలిచిన తర్వాత..

    Hardik Pandya: కెప్టెన్‌గా ధోనిని గుర్తుకు తెచ్చిన హార్థిక్‌ పాండ్యా! సి...

  • Hardik Pandya: కెప్టెన్లుగా ధోని, కోహ్లీకి సాధ్యంకాని రికార్డును సాధించిన హార్థిక్‌ పాండ్యా

    Hardik Pandya: కెప్టెన్లుగా ధోని, కోహ్లీకి సాధ్యంకాని రికార్డును సాధించి...

Web Stories

మరిన్ని...

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో  హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

ఈ సంవత్సరం ఫస్ట్ హాఫ్ తో హిట్ గా నిలిచిన 13 సినిమాలు ఇవే!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

బజర్దస్త్‌ రీతూ.. అందాల రచ్చ!

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్స్

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

యాంకర్ మంజూష లేటెస్ట్ గ్లామరస్ పిక్స్!

తాజా వార్తలు

  • Sudigali Sudheer: గాలోడు మూవీ షూటింగ్ లో సుడిగాలి సుధీర్.. వైరల్ గా మారిన వీడియో!

  • Naresh: రాకేశ్‌ శెట్టితో కలిసి రమ్య రఘుపతి మాపై దాడి చేసింది: నరేశ్‌

  • Kishor Das: క్యాన్సర్‌తో పోరాడి కన్నుమూసిన ప్రముఖ హీరో!

  • Anchor Shiva: రాశీ ఖన్నాకి యాంకర్ శివ ప్రపోజ్.. దిమ్మతిరిగే జవాబిచ్చిన బ్యూటీ!

  • Naresh- Ramya Raghupathi: ఒకే రూమ్‌లో నరేశ్‌- పవిత్ర.. రెచ్చిపోయిన మూడో భార్య!

  • Mysuru: జుట్టు రాలిపోతుందని ఆత్మహత్య చేసుకున్న యువతి!

  • Naresh- Pavitra: మైసూర్‌ హోటల్‌ లో నరేశ్‌- పవిత్రను అడ్డుకున్న మూడో భార్య రమ్య!

Most viewed

  • పెళ్లి సంబంధాల పేరుతో యువతి మోసం!

  • దేశంలో అత్యంత ధనవంతు రాలు – బొడ్డు నాగలక్ష్మి

  • రఘురామకృష్ణరాజు అరెస్ట్ పై హైకోర్టు ఏం చెప్పబోతోంది

  • ఎంపీ రఘురామ కృష్ణరాజును ఎందుకు అరెస్టె చేశారంటే

  • యాంకర్ లాస్యకు ఎప్పుడూ అదే ద్యాస అంటున్న రవి

  • దగ్గుబాటి వారసుడికి నో చెబుతున్నహీరోయిన్లు, కారణం శ్రీరెడ్డి

  • కమల్ హాసన్ ను ఓడించిన మహిళ ఎవరో తెలిస్తే షాక్

Suman TV Telugu

More from us

SumanTVSumanTV EntertainmentSumanTV NewsSumanTv GoldSumanTV DailySumanTV MOMSumanTV LifeSumanTv LegalSumanTV MoneySumanTV SpiritualSumanTV EducationSumanTV TamilSumanTV VijayawadaSumanTV East GodavariSumanTV Vizag

Our Network

  • Suman TV Fb
  • Suman TV Twitter
  • Suman TV Instagram
  • Suman TV Youtube
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam
SumanTV About Us Contact Us Privacy Policy Disclaimer