ఐపీఎల్ 2022లో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ అంతగా ప్రభావం చూపలేకపోతుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరి నుంచి రెండో స్థానంలో ఉంది. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌ల్లో గెలిచింది రెండంటే రెండు మాత్రమే. పంజాబ్ కింగ్స్‌పై ఆడిన చివరి మ్యాచ్‌లోనూ పరాజయాన్ని అందుకుంది. దీంతో ఆ జట్టుకు ప్లేఆఫ్స్ వెళ్లే దారులు దాదాపు మూసుకుపోయినట్లే. దీనికి తోడు ఆ జట్టు ఆటగాళ్లు గాయాల బారిన పడటం సీఎస్కేకు మరో తలనొప్పిలా మారింది. మిడిల్ ఆర్డర్లో కొద్దో, గొప్పో రాణిస్తూ వస్తోన్న బ్యాటర్ అంబటి రాయుడు తాజాగా గాయపడ్డాడు.
పంజాబ్ కింగ్స్‌తో మ్యాచ్ సందర్భంగా రాయుడి చేతిపై గాయమైంది. ఆ గాయంతోనే బ్యాటింగ్ చేశాడు. పంజాబ్ కింగ్స్ నిర్దేశించిన 188 పరుగుల లక్ష్యాన్ని అందుకునే క్రమంలో అంబటి రాయుడు అద్భుతంగా ఆడిన విషయం తెలిసిందే. 39 బంతుల్లో 78 పరుగులు సాధించాడు. ఇందులో ఏడు ఫోర్లు, ఆరు సిక్సర్లు ఉన్నాయి. మొండిగా బ్యాటింగ్ చేయడం గాయాన్ని మరింత తీవ్రం చేసింది. చర్మంపై వాపు, పొక్కులతో అతను బాధపడుతున్నాడు. అది ఇప్పటికీ రాయుడిని వేధిస్తూనే ఉందని స్టీఫెన్ ఫ్లెమింగ్ పేర్కొన్నాడు. ఇంకో నాలుగు రోజుల్లో చెన్నై సూపర్ కింగ్స్ తన తరువాతి మ్యాచ్‌ను ఆడాల్సి ఉంది. దూకుడు మీదున్న సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఢీ కొట్టాల్సి ఉంది. ఇంకా నాలుగు రోజుల సమయం ఉన్నప్పటికీ అంబటి రాయుడు అందుబాటులో ఉండడం కష్టంగానే మారింది.
చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆదుకుంటోన్నది అంబటి రాయుడే. ఇప్పటివరకు ఆడిన ఎనిమిది మ్యాచ్‌లల్లో అతను 246 పరుగులు చేశాడు. అత్యధిక వ్యక్తిగత స్కోర్ 78. పంజాబ్ కింగ్స్‌పై దీన్ని సాధించాడు. బ్యాటింగ్ యావరేజ్ 35.14. 129.47 స్ట్రైక్ రేట్‌తో రాణిస్తున్నాడు. ఇప్పుడు అతన కూడా గాయపడటంతో చెన్నైకు మరిన్ని కష్టాలు తప్పేలా లేవు. ఇప్పటికే ఆ జట్టు కోట్లు పెట్టి కొన్ని దీపక్ చాహర్ గాయం కారణంగా మొత్తం సీజన్‌కే దూరమయ్యాడు. ఇప్పుడు రాయుడు కూడా దూరమైతే.. చెన్నై మరింత బలహీన పడనుంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: తన ఓవర్లో రెండు సిక్సులు కొట్టిన పరాగ్‌తో గొడవకు దిగిన హర్షల్ పటేల్
Ambati Rayudu Got injured his wrist in the first innings but came to bat at his usual position and delivered this brilliant innings! 👏🏼👏🏼👏🏼#AmbatiRayudu #Rayudu #CSKvPBKS #PBKS #PBKSvCSK #IPL #IPL2022 pic.twitter.com/SupJxLBEA7
— Vtrakit Cricket (@Vtrakit) April 25, 2022
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.