సామ్ కరన్ స్థానంలో చెన్నైలోకి కరేబియన్ ప్లేయర్.. ఎవరీ డొమినిక్ డ్రేక్స్?

Dominic Drakes

ఐపీఎల్ 2021 సెకండ్ సీజన్ లో అన్ని జట్లు హోరాహోరిగా తలపడుతున్నాయి. ఇక పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానానికి ఎగబాకిన చెన్నై సూపర్ కింగ్స్ తన ఆట తీరుతో మెరుగైన ఫలితాలు రాబడుతుంది. అయితే గత రెండు మ్యాచ్ లో మాత్రం సీఎస్కే టీం ఘోరంగా ఓటమి పాలైంది. ఇక హోరాహోరిగా సాగుతున్నఈ క్రమంలోనే చైన్నైటీం ఆటగాడు సామ్ కరన్ గాయంతో మ్యాచ్ కు దూరమయ్యాడు. దీంతో సీఎస్కే టీం నిర్వాహకులు కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో అద్భుతంగా రాణించిన బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ డొమినిక్‌ ను టీంలోకి తీసుకున్నారు.