షణ్ముఖ్‌ తో హగ్‌ విషయాన్ని ప్రస్తావించినందుకు తల్లిపై సిరి సీరియస్‌

siri mother

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ మొత్తం ఎమోషన్స్‌ తో నిండిపోయింది. ఒక్కొక్క ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెంబర్స్‌ వచ్చి బిగ్‌ బాస్‌ హౌస్‌ లో ఫుల్‌ ఎంజాయ్‌ చేస్తున్నారు. 81 రోజులు గడిచిన తర్వాత హౌస్‌ మేట్స్‌ లో జోష్‌ నింపుతున్నారు. అలాగే వచ్చిన సిరి తల్లి చెప్పిన మాటలు.. వాటికి సిరి స్పందించిన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. సిరి తల్లి రాగానే అందరినీ పలకరించి తర్వాత సిరిని హగ్‌ చేసుకుంటుంది. ‘చాలా బాగా ఆడుతున్నావు. కానీ, షణ్ముఖ్‌ ని హగ్‌ చేసుకోవడం నాకు నచ్చట్లేదు. తండ్రిలేని నీకు.. ఒక తండ్రిలా, ఒక అన్నలా, ఒక ఫ్రెండ్‌ లా షణ్ముఖ్‌ సపోర్ట్‌ చేస్తున్నాడు. అది నాకు బాగా నచ్చింది. కానీ, నువ్వు హగ్‌ చేసుకోవడం నాకు నచ్చట్లేదు’ అని హౌస్‌ మేట్స్‌ ముందు అనేస్తుంది.

అలా ఎందుకు అన్నావ్‌?

తర్వాత బెడ్‌ రూమ్‌ లో కూర్చుని మాట్లాడుతున్న సమయంలో సిరి చాలా అసహనం వ్యక్తం చేసింది. ‘అలా అందరి ముందు ఎందుకు చెప్పావ్‌? 24 గంటల్లో మీరు చూసేది ఒక గంట మాత్రమే. అవి మా ఎమోషన్స్‌.. అలా అందరి ముందు చెప్పడం ఏంటి? మా ఇద్దరికి పర్సనల్‌ గా చెప్పాలి. షణ్ముఖ్‌ ని పిలుస్తా వాడు ఫీల్‌ అయ్యాడు. మాములుగా మాట్లాడు. తండ్రి, అన్న ఏం వద్దు.. ఫ్రెండ్‌ అను చాలు’ అంటూ సిరి చాలా కఠువుగా మాట్లాడేసింది.

షణ్ముఖ్‌ అప్సెట్‌..

సిరి తల్లి మాటలకు షణ్ముఖ్‌ ఎంతో బాధ పడ్డాడు. ఏడ్చేశాడు కూడా. ‘అంత బ్యాడ్‌ గా ఉందా? నా గేమ్‌ కూడా కాదని సపోర్ట్‌ చేసినందుకు నాకు మాటొచ్చింది’ అంటూ షణ్ముఖ్‌ ఎంతో బాధ పడ్డాడు. తర్వాత సిరి దగ్గరకు వచ్చినా కూడా అవాయిడ్‌ చేశాడు. మరోవైపు సిరి స్పందించిన తీరు చూసి నెట్టింట తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మంచి మాట చెప్పినందుకు తల్లిపై సీరియస్‌ అవుతావా అంటూ కామెంట్‌ చేస్తున్నారు. తప్పు చేస్తున్నావని తల్లి చెప్పడం తప్పా? అంటూ ప్రశ్నిస్తున్నారు. సిరి స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్‌ చేయండి.