సరయు ఎలిమినేషన్‌ వెనుకున్న అసలు కారణాలు ఇవే!

sarayu biggboss

సక్సెస్‌పుల్‌గా నడుస్తున్న బుల్లితెర రియాలిటీ షో ‘బిగ్‌ బాస్‌ 5 తెలుగు’. ఈసారి ఆట చాలా జోష్‌గా నడుస్తోంది. హౌస్‌లోకి కంటెస్టెంట్లు అడుగుపెట్టి అప్పుడే వారమైపోయింది. ఆరుగురు నామినేషన్స్‌లో ఉంటే ప్రేక్షకులు తలచింది ఒకటి.. అక్కడ జరుగుతోంది ఒకటి అంటూ పుకార్లు మొదలైపోయాయి. దానికి అసలు కారణం మొదటి వారంలో సరయుని ఎలిమినేట్‌ చేయడమే. ఓటింగ్‌ ప్రకారం చూసినా.. సరయుకి ఎక్కువ ఓట్లే వచ్చుంటాయని అందరూ భావిస్తున్నారు. అసలు సరయు ఎలిమినేట్‌ అనగానే బుల్లితెర, యూట్యూబ్‌ అభిమానులు షాక్‌కు గురయ్యారు. భారీ అంచనాలతో, బిగ్‌బాస్‌ని ధంధం చేద్దామని వచ్చిన బోల్డ్‌ బ్యూటీ మొదటి వారంలోనే బయటకు వెళ్లడాన్ని ప్రేక్షకులు, అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.

biggboss sarayuఅసలు సరయు ఎనిమినేషన్‌ వెనుక కుట్ర జరిగిందంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జోరందుకుంది. బిగ్‌ బాస్‌ కాన్సెప్ట్‌ ఏంటి? సమాజంలో సెలబ్రిటీలుగా ఉండి, జానాధరణ కలిగిన వారిని హౌస్‌లోకి కంటెస్టెంట్లుగా తీసుకొస్తారు. వారందరూ రీల్‌ లైఫల్‌లో ఉండే పరిస్థితులు వేరు.. రియల్‌ లైఫ్‌లో సెలబ్రిటీలు ఉండేది వేరు అని తెలియజేయడమే ఈ షో అసలు కారణం. అలా చివరివరకు హౌస్‌లో ఉంటూ వారిని వారు నిరూపించుకున్న వారే విజతలుగా నిలుస్తారు. ఇదంతా బానే ఉంది. మరి, సరయుకి ఆ అవకాశం ఎక్కడ దక్కింది అంటూ విమర్శిస్తున్నారు. సరైన అవకాశం ఇవ్వకుండానే మొదటి వారంలోనే ఎలిమినేట్‌ చేస్తున్నారు. కనీసం రెండు వారాలైనా ఉంచాలి కదా అన్న వాదనలు వినిపిస్తున్నాయి.

biggboss sarayuసరయుకి బిగ్‌ బాస్‌ హౌస్‌ ఎంట్రీ నుంచి అన్యాయమే జరిగిందని అభిమానులు వాపోతున్నారు. ఎవరి సపోర్ట్‌ లేకుండా జీవితంలో ఒక్క అవకాశం కోసం ఎన్నో కష్టాలు పడి.. 7 ఆర్ట్స్‌ అనే ఒక యూట్యూబ్‌ ఛానల్‌లో ఛాన్స్‌ సంపాదించింది సరయు. ఎందుకు ఆ బోల్డ్‌ కంటెంట్‌ చేస్తోంది? అలా చేయాల్సిన పరిస్థితులు ఎందుకు వచ్చాయి? అన్నది ప్రేక్షకులకు వివరించలేదు. పేరుకి బోల్డ్‌ కంటెంట్‌ అయినా సరయు ఎప్పుడూ ఏదొక మెసేజ్‌ ఇస్తూనే ఉంటుంది. తెర మీద కనిపించే సరయు వేరు.. తెర వెనుకున్న అసలు సరయుని చూపించే అవకాశం ఇవ్వలేదని ఆమె మిత్రులు, సన్నిహితులు అంటున్నారు. ఆ వాదనకు ప్రేక్షకుల అభిప్రాయాలు కూడా మద్దతుగా నిలుస్తున్నాయి.

biggboss sarayuబిగ్‌ బాస్‌ ఎంట్రీ ప్రోమోలో కూడా సరయుని బోల్డ్‌గానే చూపించారు. ఆమె యూట్యూబ్‌ వీడియోల్లో చేసే కారెక్టర్లను ప్రతిబింబిచేలాగే ఉంది. ఆ ప్రోమో చూసిన సగటు మహిళలు సరయుకు సపోర్ట్‌ చేసే అవకాశం లేదని. అసలు సరయుని ఎక్కడా చూపించ లేదు. వారం మొత్తంలో బిగ్‌ బాస్‌ కంటెంట్‌లో సరయు కనిపించింది కెప్టెన్సీ టాస్క్‌లో ఆర్జే కాజల్‌తో వివాదం జరిగినప్పుడు, శనివారం ‘సెట్‌- కట్‌’ టాస్క్‌ సమయంలో మాత్రమే అని విమర్శిస్తున్నారు. అసలు ఎలిమినేషన్‌లో ఉన్న కంటెస్టెంట్‌కి స్క్రీన్‌ స్పేస్‌ ఇవ్వకుండా, తనను నిరూపించుకునే ఛాన్స్‌ ఇవ్వకుండా సరయుని ఎలిమినేట్‌ చేస్తున్నారు. ఆ ఎలిమినేషన్‌ వెనుక కుట్ర జరిగిందంటూ అభిప్రాయపడుతున్నారు. అందరూ జశ్వంత్‌, హమీదాలో ఒకరు ఎలిమినేట్‌ అవుతారని భావించారు. హమీదాకి శ్రీరామచంద్రతో లవ్‌ బీజీఎం, జశ్వంత్‌కు జైల్‌ సెటప్‌తో కావాలనే సేవ్‌ చేశారంటూ ఆరోపిస్తున్నారు.

మరి, ఈ ఆరోపణలు, విమర్శలను బిగ్‌ బాస్‌ టీమ్‌ ఎలా ఎదుర్కొంటారు? వైల్డ్‌ కార్డ్‌ ఎంట్రీలాంటి కాన్సెప్టులతో మళ్లీ సరయుని హౌస్‌లోకి తెచ్చే ఆలోచన ఉందా అన్నది వెయిట్‌ చేసి చూడాల్సిందే. (బిగ్‌ బాస్‌ 5 తెలుగు లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర అంశాలు, ఎనాలసిస్‌ కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని ఫాలో అవ్వండి.)