ప్రియాంక సింగ్‌ పరువాలు.. సింగర్‌ శ్రీరామ్‌ రాగాలు.. లోబో అభినయాలతో మాములుగా లేదుగా..

priyanka biggboss

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌లో గ్రూపులు, కెప్టెన్సీ టాస్కులతో హాట్‌ హాట్‌గా మారింది. అనూహ్య సంఘటనల మధ్య సింగర్‌ శ్రీరామచంద్ర హౌస్‌లో కెప్టెన్‌గా మారాడు. ఈసారి ఇమ్యూనిటీనే ప్రధాన లక్ష్యంగా శ్రీరామ్‌ కెప్టెన్సీ కోసం పోటీచేశాడు. తన మీద తనకే నమ్మకం తగ్గిపోతోందేమో అని అనిపిస్తోంది. హమీదా మొదట నేను కూడా వెళ్తానంది కానీ, మళ్లీ తప్పుకుంది. కెప్టెన్సీ రచ్చ అయ్యాక హౌస్‌లో కాస్త నవ్వులు పూస్తున్నాయి.

priyanka biggbossప్రియాంక సింగ్‌ అందాలతో హౌస్‌లోని సభ్యులనే కాదు ప్రేక్షకులను కూడా కట్టిపడేస్తోంది. నల్ల చీరలో నాభి అందాలు చూపిస్తూ అలా నడిచి వెళ్తోంటే సింగర్‌ శ్రీరామ్‌ నోటి వెంట అతనికి తెలియకుండానే పాటలు వచ్చేశాయి. ఇంక ప్రియాంక సింగ్‌ లోబోతే కలిసి ఖుషీ సినిమాలో భూమిక, పవన్‌కల్యాణ్‌ నటించిన అద్భుతమైన పార్కు సీన్‌ను చేసి చూపించారు. పవన్‌ కల్యాణ్‌ పాత్రలో లోబో ఎంతో ఆకట్టుకున్నాడు. భూమిక పాత్రలో ప్రియాంక ఇమిడి పోయింది. ఆమె అభినయంతో అభిమానులను అలరించింది. మరోవైపు నటరాజ్‌ మాస్టర్‌, యాంకర్‌ రవిల మధ్య వివాదం బాగా ముదురుతోంది. రవి.. నటరాజ్‌ మాస్టర్‌ మీద బాగా గుర్రుగా ఉన్నాడు. వీరిద్దరి మధ్య వివాదం ప్రత్యక్షంగా, పరోక్షంగా  గట్టిగానే సాగుతోంది. మరి శుభం కార్డు ఎక్కడపడుతుందో చూడాలి

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ లేటెస్ట్‌ అప్‌డేట్స్‌, గాసిప్స్‌, ఎలిమినేషన్స్‌ వంటి ఆసక్తికర కథనాల కోసం సుమన్‌ టీవీ వెబ్‌సైట్‌ని చూస్తుండండి.