‘బిగ్ బాస్ 5 తెలుగు’ హౌస్ లో సిరి- షణ్ముఖ్ పై ప్రచారాలు!

shannu siri hug

బిగ్‌ బాస్‌ 5 తెలుగు’ హౌస్‌ లో ఏం జరిగినా అది బయట పెద్ద రచ్చ.. వార్తలే అవుతాయి. అక్కడ జరిగింది గోరంత అయితే.. దానిని కొండంత చేసి చూపిస్తుంటారు. అలా జరిగిన ఒక ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలో పెద్ద దుమారమే రేపుతోంది. షణ్ముఖ్‌- సిరి ముద్దు పెట్టుకున్నారు అంటూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. వారిద్దరూ రెచ్చిపోతున్నారు అంటూ అక్కసు వెళ్లగక్కే వారు ఇప్పుడు ఇంకాస్త ముందుకు వెళ్లి ముద్దు అంటూ దుమారం రేపారు.

అసలు జరిగింది..

షణ్ముఖ్‌- సిరి ఇద్దరూ మధ్య డిస్టబ్రెన్సెస్‌ తర్వాత.. బెడ్‌ రూమ్‌ లో కూర్చొని ఉన్న షణ్ముఖ్‌ దగ్గరకు సిరి వస్తుంది. సారీ చెప్తున్నట్లుగా షణ్ముఖ్‌ సిరిని హగ్‌ చేసుకుంటాడు. కాసేపటి తర్వాత సిరి కూడా షణ్ముఖ్‌ ను హగ్‌ చేసుకుంటుంది. ఆ సమయంలో రెండు కెమెరాల ఫ్రేమ్‌ ల మార్పు సమయాన్ని కలుపుకుని అక్కడేదో జరిగిపోయిందని ప్రచారాలు చేసుకుంటున్నారు. ఆ ఫ్రేమ్‌ ఛేంజింగ్‌ ని ముద్దు అంటూ ప్రచారాలు మొదలు పెట్టారు. అవకాశం దొరికిందని దానిని వైరల్‌ చేస్తున్నారు. అక్కడ జరిగింది కేవలం వారిద్దరూ మంచి ఫ్రెండ్స్‌ లా హగ్‌ చేసుకున్నారు అంతే.

ఎందుకు వీరికి గొడవలు..

షణ్ముఖ్‌, సిరి ఇద్దరూ బయట అంత గొప్ప ఫ్రెండ్స్‌ కాకపోయినా.. హౌస్‌లో మంచి మిత్రులయ్యారు. వారిద్దరూ మొదటి నుంచి ఒకేలా ఉన్నారు. షణ్ముఖ్‌, సిరి, జెస్సీల కాంబోను ఎవ్వరూ విడదీయలేరు. జెస్సీ వెళ్లిపోయినప్పటి నుంచి వీరిద్దరూ బాగా డిస్ట్రబ్‌ అయ్యారు. చాలా లోన్‌లీగా ఫీలవుతున్నారు. అందుకే ప్రతి చిన్న దానికి గొడవ పడుతూ కనిపిస్తున్నారు. అలా ఇద్దరూ తిట్టుకోవడం, ఏడ్వడం, తిరిగి కలిసి కూర్చొని మాట్లాడుకోవడం ఎంతో కామన్‌.