అతడికి 39 మంది భార్యలు ! ప్రపంచంలోనే అతి పెద్ద కుటుంబం!

ఈరోజుల్లో ఎవరైనా చిన్న కుటుంబం ఉండాలి అనుకుంటారు. చిన్న కుటుంబం.. చింతలు లేని కుటంబం అని భావిస్తారు. ఇద్దరు ముద్దు.. ముగ్గురు వద్దు అనే రోజులు పోయి. ఇద్దరు కూడా వద్దు.. ఒక్కరే ముద్దు అనే రోజులు వచ్చేస్తున్నాయి. కానీ.., మన తాతల కాలంలో పరిస్థితి ఇలా ఉండేది కాదు. ఇంట్లో ఎంత మంది సంతానం ఉంటే అంత గర్వంగా ఫీల్ అయ్యే వాళ్ళు. వాళ్ళ బలగం పెద్దది అంటూ ఊరిలో అందరూ గౌరవం ఇచ్చే వాళ్ళు. వారి జోలికి ఎవ్వరూ వచ్చే వాళ్ళు కాదు. కానీ.. ఈరోజుల్లో అలాంటి కుటుంబాలను చూడాలన్నా చూడలేము. కానీ.., ఓ వ్యక్తి మాత్రం ఈ పెద్ద కుటుంబం అనే థీమ్ ని చాలా సీరియస్ గా తీసుకున్నట్టు ఉన్నాడు. ఆయనే సొంతగా ఓ పెద్ద కుటుంబాన్ని సిద్ధం చేసుకున్నాడు. ఇందుకు ఏకంగా 39 పెళ్లిళ్లు చేసుకున్నాడు. 94 మంది పిల్లలను కన్నాడు. ఇప్పుడు ప్రపంచంలో కల్లా అతడిది అతిపెద్ద కుటుంబం. వాళ్ళ కుటుంబ సభ్యులు అంతా కలిపితే ఒక గ్రామంలో ఉండే ప్రజలకు సమానంగా ఉంటుంది. వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఇది వాస్తవం. ఆ కుటుంబం ఇప్పటికీ ఉమ్మడిగానే.. ఒకే ఇంట్లో చాలా సంతోషంగా నివసిస్తున్నారు.

wife 1 1

మిజోరాంలోని బాట్వాంగ్ గ్రామంలో ఓ కుటుంబం దాదాపు 100 గదులతో కూడిన ఇంట్లో నివసిస్తోంది. ఆ కుటుంబం పెద్ద జియోనా చనా. అతడి వయసు 76 సంవత్సరాలు. అతడికి 39 మంది భార్యలు.. 94 మంది పిల్లలు.. 14 మంది కుమార్తెలు.. 33 మంది మనవరాళ్లు.. ఒక మనవడు ఉన్నారు. జియోనా వృత్తి రీత్యా వడ్రంగి. ఇదిలా ఉంటే.. ఈ కుటుంబంలోని వ్యక్తులందరూ.. ఒకరిపై ఒకరు ఆధారపడరు. ఎవరి అవసరాలకు వారే పనులు చేసుకుంటారు. జియోనాకు పెద్ద మొత్తంలో సాగు భూమి ఉంది. ఇక్కడ జియోనా కుటుంబ సభ్యులు ఆహార ధాన్యాలు.. కూరగాయలు, పండ్లను పండిస్తారు. ఇవే కాకుండా.. కోడి గుడ్ల వినియోగం చేసేందుకు సొంతంగా ఫౌల్ట్రీఫాం ను కూడా నిర్వహిస్తున్నారు. ఈ ఇంటిలో ఎవరి సంపాదన వారిది. ఎవరు అవసరాలు వాళ్ళు తీర్చుకుంటారు. కానీ.., అందరూ కలసి మాత్రం ఒకే ఇంట్లో ఉంటారు. కానీ.., జియోనా చనా ఎందుకు ఇంత మందిని పెళ్లి చేసుకున్నాడు? ఎందుకు ఇంత పెద్ద కుటుంబాన్ని తయారు చేసుకున్నాడు అనే విషయంలో మాత్రం స్పష్టత ఇవ్వలేదు.