Viral Video: అడవి జంతువుల్లో అత్యంత బలమైన జంతువు అంటే ఏనుగు. ఏనుగును నేరుగా ఢీకొట్టే దమ్ము ఏం జంతువుకు లేదు. అలాంటిది ఓ ఆర్టీసీ బస్సుకు ఉంటుందా చెప్పండి. ఏనుగు రోడ్డుకు అడ్డంగా నిలబడి బస్సు దగ్గరకు వస్తే లోపల ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి?.. కొంచెం అటుఇటు అయినా బస్సు ధ్వంసం అవ్వటం.. ఒకరో ఇద్దరో చావటం ఖాయం. కేరళలో కూడా ఓ బస్సుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కానీ, డ్రైవర్ సమయస్పూర్తి కారణంగా అందులోని వాళ్లు క్షేమంగా బయటపడ్డారు. వివరాల్లోకి వెళితే.. కొద్దిరోజుల క్రితం కేరళ ఆర్టీసీకి చెందిన ఓ బస్సు ప్రయాణికులతో మున్నార్ రోడ్డులో వెళుతోంది. కొంత దూరం వెళ్లిన తర్వాత ఓ ఏనుగు బస్సు ముందుకు వచ్చింది. బస్సుకు ఏనుగుకు కొంతదూరం ఉంది. ఆగిన బస్సులోంచి జనం కేరింతలు కొడుతూ దూరంగా ఉన్న ఏనుగును ఫొటోలు తీసుకున్నారు.
అది రోడ్డు దాటి పోతుందిలే అనుకున్న వాళ్లకు షాక్ ఇస్తూ బస్సు దగ్గరకు వచ్చింది. దంతాలతో బస్సు అద్దాలను కొంత పగుల కొట్టింది. కొంత సేపు బస్సు ముందే ఉండిపోయింది. దీంతో జనం బిక్కచచ్చిపోయారు. డ్రైవర్ మాత్రం ధైర్యంగా ఉండటమే కాకుండా అందులోని వాళ్లకు ధైర్యం చెప్పాడు. ఎలాంటి పొరపాటు చేయకుండా బస్సును అలాగే ఉంచాడు. అది కొంత పక్కకు రాగానే బస్సును తుర్రుమనిపించాడు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. డ్రైవర్ సమయస్పూర్తికి నెటిజన్లు అభినందనలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Don’t know who is the driver of this Government Bus but he is certainly Mr Cool 😎The way he handled the supervision check by Mr Elephant it was like bussiness as usual between them. 😊 video shared by K.Vijay #elephants #noconflict pic.twitter.com/WHxQStNv7K
— Supriya Sahu IAS (@supriyasahuias) April 6, 2022
ఇవి కూడా చదవండి : ఆర్మీ రిక్రూట్‌మెంట్ కోసం యువకుడి సాహసం..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.