మనలో చాలా మందికి పాములు అంటే భయం ఉంటుంది. కానీ.., అదే సమయంలో పాముల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా రెండు తలల పాముల గురించి చాలా కథలే విని ఉంటారు. కొన్నిసార్లు నిజంగా అలాంటి పాములు పట్టుబడ్డాయి కూడా. కానీ.., ఇలా రెండు తలలు ఉన్న పాములు కనిపించడం చాలా అరుదు. అలాంటిది మూడు తలల పాము కనిపిస్తే? మూడు తలల పామా? ఎక్కడా వినలేదు? చూడలేదు..! నిజంగా ఇలాంటి పాములు ఉంటాయా అని ఆశ్చర్యం కలుగుతుంది కదూ? అయితే.. ఈ మిస్టరీ గురించే ఇప్పుడు మనం తెలుసుకుందాం.
గత కొన్ని రోజులుగా మూడు తలల పాము ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.. ఈ ఫోటో వెనుక ఉన్న రహస్యం ఏమిటా అని ఆరా తీస్తే.. మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ బయట పడింది. ఇలా మూడు తలలతో కనిపిస్తున్న పాము.. నిజంగా పాము కాదు. ఇది కేవలం ఓ కీటకం మాత్రమే! పేరు “అటాకస్ అట్లాస్”. అట్లాస్ మాత్ అని దీనికి మరో పేరు కూడా ఉంది. సీతాకోక చిలుక జాతికి చెందిన ఈ కీటకం వయోజన దశలో.. శత్రువుల నుండి తన గుడ్లను కాపాడుకోవడానికి కేవలం రెండు వారాల పాటు.. ఇలా మూడు తలల పాములా తన తలని మార్చుకోగలదు అట.
Attacus Atlas is one of the largest butterflies in the world and lives only for two weeks with one goal in their adult stage: lay eggs and defend them until they hatch while disguised as a snake pic.twitter.com/oc7u2H288X
— Rob (@thegallowboob) October 15, 2021
ఇది కూడా చదవండి: వీడియో: ఇదేం చేప రా బాబోయ్! అనకొండను మింగేలా ఉంది!
మాంసాహార జీవులను భయపెట్టడానికి మాత్రమే ఈ కీటకం ఇలా మూడు తలల పాములా కనిపిస్తుంది. ఆసియాలో మాత్రమే ఎక్కువగా కనిపించే ఈ కీటకాలు.. ప్రస్తుతం అంతరించిపోయే జాతుల జాబితాలో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఇంటర్నెట్ ని ఒక ఊపు ఊపేస్తున్న ఈ పిక్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.